PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/nimmagadda2fedc15c-e9f6-4730-a42f-3dd8d27b612b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/nimmagadda2fedc15c-e9f6-4730-a42f-3dd8d27b612b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ఉండగా ఎన్నికలు జరపకూడదు అని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది, అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఇక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే ఈ సమయంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోmadanapalle murder;amala akkineni;kumaar;raj;shankar;andhra pradesh;geum;panchayati;court;war;ala elaఅలా ఎలా చేస్తారంటూ ఏపీ సర్కార్ పై నిమ్మగడ్డ ఫైర్ !అలా ఎలా చేస్తారంటూ ఏపీ సర్కార్ పై నిమ్మగడ్డ ఫైర్ !madanapalle murder;amala akkineni;kumaar;raj;shankar;andhra pradesh;geum;panchayati;court;war;ala elaTue, 26 Jan 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కోల్డ్ వార్  కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ఉండగా ఎన్నికలు జరపకూడదు అని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది, అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఇక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే ఈ సమయంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ల ఆకస్మిక బదిలీ. 

గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఇద్దరి మీద బదిలీ వేటు వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం నిన్న రాత్రి మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ చేయమని కోరింది వీరిని కాదు. ఆయన చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు అలాగే మరికొంత మంది పోలీసు అధికారుల లిస్ట్ ఇచ్చి వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ప్రభుత్వాన్ని కోరారు. కానీ వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా అసలు నిమ్మగడ్డ పంపని పేర్లను బదిలీ చేస్తున్నామని ప్రకటించడంలో ఏపీ ప్రభుత్వం కొత్త గేమ్ కి తెరలేపింది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి బదిలీలు చేయటం అనేది సరికాదని అంటున్నారు. ఎన్నికల సంఘం కోరితే చేయవచ్చు కానీ ఎన్నికల సంఘం పేరు చెప్పుకుని ప్రభుత్వమే ఇలా బదిలీలు చేస్తే ఎన్నికల సంఘం ఖచ్చితంగా అడ్డుపడుతుంది. ఈ మేరకు నిమ్మగడ్డ ట్విస్ట్ ఇచ్చారని కూడా ఈ ఉదయం మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. అసలు విషయం ఏమిటంటే తాను కోరని వారి పేర్లను బదిలీ చేస్తున్నామని ఎలా ప్రకటిస్తారని అంటూ నిమ్మగడ్డ ఏపీ సర్కార్ మీద ఫైర్ అయినట్లు చెబుతున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో.




మెగా డాటర్ నిహారికను ఏడిపించిన భర్త...? అంతలోనే ఏమి జరిగిందబ్బా...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>