PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharanid1286bbe-56c5-467f-ab50-5f68063c3984-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharanid1286bbe-56c5-467f-ab50-5f68063c3984-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పనిలేకుండా.. ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారు. అందులో భాగంగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వినియోగదాల సౌకర్యార్థం కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నారు.dharani;kcr;dharani;pragathi;telangana;district;court;chief minister;survey;application;sara shrawanధరణి లో కొత్త ఆప్షన్ ని చూసారా...?ధరణి లో కొత్త ఆప్షన్ ని చూసారా...?dharani;kcr;dharani;pragathi;telangana;district;court;chief minister;survey;application;sara shrawanTue, 26 Jan 2021 12:58:03 GMTతెలంగాణ రాష్ట్ర  ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పనిలేకుండా.. ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారు. అందులో భాగంగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వినియోగదాల సౌకర్యార్థం కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదును ధ‌ర‌ణి వెబ్ సైట్ ద్వారా చేప‌ట్టింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాప‌ర్టీస్ క‌లిగి ఉన్న వారిని త‌మ ఆస్తుల వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. గతంతో పోల్చితే కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల్లో విస్తీర్ణం తక్కువగా నమోదైనవారు దరఖాస్తు చేసుకొనేందుకు సిటిజన్‌ లాగిన్‌లో ‘అప్లికేషన్‌ ఫర్‌ మిస్సింగ్‌ సర్వే ఎక్స్‌టెంట్‌' ఆప్షన్‌ను జతచేశారు. ఇందులో జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌, ఉప సర్వే నంబర్‌ను ఎంచుకొన్న తర్వాత.. సంబంధిత యజమానికి ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉన్నదో కనిపిస్తుంది. సమస్య ఉన్న సర్వే నంబర్‌ను ఎంచుకొని, పక్కన ఉన్న బాక్స్‌లో వాస్తవ విస్తీర్ణం ఎంత ఉండేదో వివరించాలి. ఈ దరఖాస్తులన్నీ నేరుగా కలెక్టర్‌ వద్దకు చేరనున్నాయి. కలెక్టర్‌ విచారణ జరిపి దరఖాస్తును పరిష్కరిస్తారు.

కొన్ని వారాల క్రితం ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు.రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అత్యధికశాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. పేర్లల్లో అక్షరదోషాలు, విస్తీర్ణం నమోదులో తేడాలు, వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి కొన్ని సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలిగించడం, కంపెనీల భూముల రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలపై మీసేవ ద్వారా దరఖాస్తుకు అవకాశమిచ్చింది.


రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు !!

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>