PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pancayatifa4548d2-f7be-4e32-99ea-e3353c27214c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pancayatifa4548d2-f7be-4e32-99ea-e3353c27214c-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు దేశ అత్యున్నత న్యాయం స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయం పూర్తిగా తేలిపోయింది. మరో వైపు చూసుకుంటే నాలుగు విడతలుగా ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించేశారు. pancayati;guntur;2019;high court;bhuma akhila priya;panchayati;court;houseపంచాయతీ ఎన్నికల విషయంలో మరో టెన్షన్...?పంచాయతీ ఎన్నికల విషయంలో మరో టెన్షన్...?pancayati;guntur;2019;high court;bhuma akhila priya;panchayati;court;houseTue, 26 Jan 2021 10:30:00 GMTపంచాయతీ ఎన్నికలకు దేశ అత్యున్నత న్యాయం స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయం పూర్తిగా  తేలిపోయింది. మరో వైపు చూసుకుంటే నాలుగు విడతలుగా ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించేశారు.

ఈ నేపధ్యంలో ఈ నెల 27న హై కోర్టులో విచారణకు రానున్న ఒక పిటిషన్ మీద అందరి దృష్టి పడుతోంది. 2019 ఎన్నికల జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లుగా  ఎన్నికల  అధికారులు తెలియచేసిన నేపధ్యంలో 2021 జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలని కోరుతూ గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  పాత ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం మూడున్నర లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతారు అని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అలాగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు యవత ఆసక్తిగా ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. కొత్త జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను జరిపించాలని కూడా ఆమె విన్నపం చేసుకున్నారు. ఈ పిటిషన్  మీద ఈ నెల 27న అంటే బుధవారం విచారణ హై కోర్టులో జరగనుంది. మరి హై కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుంది అన్నది ఒక వైపు ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే కొత్త ఓటర్లు లేకుండా ఎన్నికలను నిర్వహించడం సహేతుకం అనిపించుకోదు. మరి దానికి సంబంధించిన జాబితా ఇపుడు సిధ్ధంగా ఉందా లేదా అన్నది కూడా చూడాలి. మరో వైపు చూస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు కాబట్టి ఇపుడు ఎలా తీర్ప్ ఉండబోతోంది అన్నది టెన్షన్ గా ఉంది.ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల విషయంలో మరో ఇరవై నాలుగు గంటలు  వేచి చూడాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.




కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>