TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/hyper-aadi237d6b51-875b-4b8b-ae12-9b72476b13d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/hyper-aadi237d6b51-875b-4b8b-ae12-9b72476b13d7-415x250-IndiaHerald.jpgపంచుల మహారాజు హైపర్ ఆది జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయిస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. సినిమాల్లో కూడా స్క్రిప్ట్ రాసే అవకాశాన్ని ఆయన దక్కించుకుంటున్నారు. వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా హైపర్ ఆది మెయిన్ కమెడియన్ గా కనిపించి మెప్పించారు.hyper aadi;varun;varun sandesh;varun tej;vedhika;yajamanya;roja;adinarayanareddy;telugu;jabardasth;television;comedy;comedian;nagababu;adirindiరోజా చేసిన సహాయానికి స్టేజి పైన హైపర్ ఆది కన్నీటి పర్యంతంరోజా చేసిన సహాయానికి స్టేజి పైన హైపర్ ఆది కన్నీటి పర్యంతంhyper aadi;varun;varun sandesh;varun tej;vedhika;yajamanya;roja;adinarayanareddy;telugu;jabardasth;television;comedy;comedian;nagababu;adirindiTue, 26 Jan 2021 13:00:00 GMTఆది జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయిస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. సినిమాల్లో కూడా స్క్రిప్ట్ రాసే అవకాశాన్ని ఆయన దక్కించుకుంటున్నారు. వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా హైపర్ ఆది మెయిన్ కమెడియన్ గా కనిపించి మెప్పించారు. అయితే ఆది కి బాగా పేరు రావడానికి జబర్దస్త్ వేదిక ఎంతో సహాయపడింది అని చెప్పవచ్చు. ఆయన టాలెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత జబర్దస్త్ కే దక్కుతుంది. తనకున్న పాపులారిటీని ఈరోజు కి కూడా హైపర్ ఆది పెంచుకుంటూ పోతున్నారంటే దానికి కారణం జబర్దస్త్ జడ్జి ఆర్.కె.రోజా.

ఎందుకంటే ఒకానొక సమయం లో హైపర్ ఆది జబర్దస్త్ ని వీడి జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షో కి వెళ్లాలి అనుకున్నారు. జీ టీవీ యాజమాన్యంతో భారీ మొత్తంలో డబ్బులు కూడా మాట్లాడుకున్నారు. కళ్ళు చేదిరే పారితోషికం ఇవ్వడానికి జీ యజమాన్యం సిద్ధం కావడంతో హైపర్ ఆది జబర్దస్త్ షో కి పంగనామం పెట్టి నాగబాబుతో కలిసి జీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సమయంలో రోజా హైపర్ ఆది ని పిలిపించి జబర్దస్త్ కామెడీ షో ని వదిలి వెళితే కెరియర్ ముగిసినట్లే. మల్లెమాల క్రియేషన్స్ వారు మీ కామెడీ ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు మరెవరూ తీసుకెళ్లలేరు. వాళ్లని కాదని వెళ్లి పోతే తర్వాత ఎంత ఏడ్చినా లాభం ఉండదు అని చెప్పారట. దీంతో హైపర్ ఆది ఆలోచనలో పడిపోయి రోజా చెప్పినట్టే విని జబర్దస్త్ షో ను వదిలిపెట్టలేదు.

అయితే జీ తెలుగు లో ప్రసారమైన అదిరింది షో కొన్ని నెలల తర్వాత 'బొమ్మ అదిరింది' గా మారింది కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నాగబాబు కూడా షో ని మరింత హాస్యభరితంగా నడిపించ లేక ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. అది చాలదన్నట్టు రాజకీయ నేతలను కమెడియన్స్ చేత అవహేళన చేయిస్తూ అసలుకే ఎసరు తెచ్చారు. దీంతో జీ తెలుగులో ప్రసారమవుతున్న కామెడీ షో లు మొత్తం మూతపడ్డాయి. ఫలితంగా నాగబాబు మాట విని జబర్దస్త్ ని కాదని బయటికి వచ్చిన వారి పరిస్థితి ఘోరం గా మారింది. అయితే ఇదంతా చూస్తున్న హైపర్ ఆది.. ఆరోజు ఆర్.కె.రోజా మాట వినకపోతే ఈరోజు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే వాడినని.. రోజా తనకు ఎంతో మంచి చేశారని భావోద్వేగానికి గురి అవుతూ తన సన్నిహితుల దగ్గర వాపోయారు.


రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు !!

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>