MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/prabhasc800425c-07b5-46c1-adfb-330b70bc5d62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/prabhasc800425c-07b5-46c1-adfb-330b70bc5d62-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ను చూసి దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగింది. దాంతో ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు "జిల్" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినprabhas;prabhas;pooja hegde;saif ali khan;prasanth;prashanth neel;shyam;sridhar;india;godavari river;adinarayanareddy;bollywood;cinema;bahubali;jil;love;graphics;heroine;news;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;peddapalli;love storyగోదావరిఖని బొగ్గు గనుల్లో "సలార్" షూటింగ్.?గోదావరిఖని బొగ్గు గనుల్లో "సలార్" షూటింగ్.?prabhas;prabhas;pooja hegde;saif ali khan;prasanth;prashanth neel;shyam;sridhar;india;godavari river;adinarayanareddy;bollywood;cinema;bahubali;jil;love;graphics;heroine;news;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishor;peddapalli;love storyTue, 26 Jan 2021 14:24:54 GMTబాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ను చూసి దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగింది. దాంతో ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు "జిల్" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.  సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రభాస్ మరో రెండు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో "ఆది పురుష్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో లంకేశ్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయబోతున్నట్టు ఇటీవలే దర్శకుడు ప్రకటించాడు.

ఇక మరోవైపు "కేజిఎఫ్" సినిమాతో దేశ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో "సలార్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా పూర్తి చేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం "సలార్" సినిమా షూటింగ్ ను పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని లో చేయబోతున్నట్టు తెలుస్తోంది. గోదావరిఖనిలోని ఆర్జీ-3 డివిజన్ ఓసిపీ2 లో సినిమా షూటింగ్ జరగబోతుందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ వచ్చి కోల్ మైన్ ఎండీ నడిమెట్ల శ్రీధర్ ను కలిసి అనుమతి తీసుకున్నారట. 15రోజుల క్రితం ప్రశాంత్ నీల్ వచ్చి గోదావరిఖనిలో ఓపెన్ కాస్ట్ లను పరిశీలంచారని మరికొద్దిరోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలువస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫిషల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.  







బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>