PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/joe-bidden0aeda0e4-195d-447d-b981-bb7f0c63ecc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/joe-bidden0aeda0e4-195d-447d-b981-bb7f0c63ecc2-415x250-IndiaHerald.jpgకరోనా భయంతో గజగజ వణుకుతున్న అమెరికాలో.. ఈ భయాన్ని తగ్గించేందుకు ఇటీవలే అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అదేంటంటే.. కొన్ని దేశాలకు వెళ్లి, మళ్లీ అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్న విదేశీయులు అంటే నాన్-యూఎస్ పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు ఓ నివేదిక వెలుగు చూసిందిbiden;brazil;ireland;american samoa;doctorఆ దేశాలకు వెళ్లారా? అయితే అమెరికాకు రానివ్వరట!ఆ దేశాలకు వెళ్లారా? అయితే అమెరికాకు రానివ్వరట!biden;brazil;ireland;american samoa;doctorMon, 25 Jan 2021 11:27:00 GMTఅమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అదేంటంటే.. కొన్ని దేశాలకు వెళ్లి, మళ్లీ అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్న విదేశీయులు అంటే నాన్-యూఎస్ పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు ఓ నివేదిక వెలుగు చూసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో యూరప్‌ ఖండంలోని యునైటెడ్ కింగ్‌ డమ్, ఐర్లాండ్, అలాగే బ్రెజిల్ వంటి దేశాల ఇటీవల కాలంలో సందర్శించిన వారు అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. అలాాగే ఈ దేశాలకు అమెరికా ప్రజలు ఎవరూ వెళ్లకుండా కొత్తగా ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఈ జాబితాలో మొత్తం మీద 26 దేశాలు ఉన్నాయట. ఈ దేశాల నుంచి ఎవరైనా ఇతర దేశాల పౌరులు అంటే అమెరికన్లు కాని వారు.. ఎవరైనా సరే అమెరికాలో ప్రవేశించడం ఇక కష్టమే. అలా ఎవరూ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటుందట బైడెన్ సర్కారు. అయితే ఈ దేశాలకు వెళ్లిన అమెరికన్ పౌరుల విషయంలో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉందని కొంత మంది ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై సోమవారం నాడు పూర్తి స్థాయి ప్రకటన వెలువడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ జాబితాలో తాజాగా సౌతాఫ్రికాను కూడా చేర్చినట్లు డాక్టర్ అన్నె షుచాట్ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. కరోనాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు బైడెన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచి పని చేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే దేశంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?

నగరిలో రోజాని ఇబ్బంది పెడుతుంది ఆ వైసీపీ నాయకుడేనా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>