PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganmohan-reddy34b60f84-939a-4345-b30b-3b589905a5aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganmohan-reddy34b60f84-939a-4345-b30b-3b589905a5aa-415x250-IndiaHerald.jpg72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో, ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. jaganmohan reddy;amala akkineni;krishna;praveen;krishna river;jagan;andhra pradesh;district;collector;chief minister;governor;reddyఅన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఏపీలో పాలన: సీఎం జగన్అన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఏపీలో పాలన: సీఎం జగన్jaganmohan reddy;amala akkineni;krishna;praveen;krishna river;jagan;andhra pradesh;district;collector;chief minister;governor;reddyMon, 25 Jan 2021 19:58:00 GMT72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర  ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో  గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో,  ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రమైన మన దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు, భావపరమైన, వ్యక్తీకరణ పరమైన, మతపరమైన స్వాతంత్య్రాలను మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ప్రసాదించిందని, పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను పెంపొందించేలా మన రాజ్యాంగం దిశా నిర్దేశం చేసిందని, సోదర భావంతో కలిసి ఉండాలని నిర్దేశించిందని, ఈ అన్ని సూత్రాలకు ప్రతిరూపంగానే ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలలుగా పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
                     ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఏయండీ ఇంతియాజ్, తదితరులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు. ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు 10 వేల మంది వరకూ ఆహుతులను అనుమతించేవారు కానీ కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది కేవలం 2 వేల మంది వరకు మాత్రమే అనుమతించడం జరుగుతోంది. ఈ వేడుకల్లో పేరేడ్, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వేడుకల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అదేవిధంగా ఆహుతుల సౌకర్యార్ధం స్టేడియం ఆవరణలో ప్రత్యేకంగా శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రిపబ్లిక్ వేడుకల్లో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం ఇస్తారు. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. శకటాలలో గతంలో 10 మంది వరకు అనుమతించేవారమని ఈ సారి నలుగురు నుంచి ఐదుగురు వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది.
 


అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>