Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/non-bailable-warrant-issued-over-mim-chief-asaduddin05af61c6-3550-4a27-bc72-0871e4717861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/non-bailable-warrant-issued-over-mim-chief-asaduddin05af61c6-3550-4a27-bc72-0871e4717861-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐదేళ్ల జరిగిన ఈ దాడి కేసులో ఇప్పటివరకు అసద్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఈ మేరకు వారెంట్ జారీ చేసింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమనేనని..asaduddin owaisi;kumaar;ali;hyderabad;korcha;uttam kumar reddy nalamada;congress;police;court;car;minister;police station;traffic police;reddy;party;criminalఅసదుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏ కేసులో అంటే...!అసదుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏ కేసులో అంటే...!asaduddin owaisi;kumaar;ali;hyderabad;korcha;uttam kumar reddy nalamada;congress;police;court;car;minister;police station;traffic police;reddy;party;criminalMon, 25 Jan 2021 13:58:05 GMTహైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐదేళ్ల జరిగిన ఈ దాడి కేసులో ఇప్పటివరకు అసద్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఈ మేరకు వారెంట్ జారీ చేసింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమనేనని, ఆయన చర్య క్షమించరానిదని, అందుకే ఆయనపై వారెంట్ జారీ చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే 2015లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ కారుపై కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిలో కొందరు కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై కూడా దాడి చేశారు. ఆ సమయంలో అదే కారులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దాడి సమయంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఆయనే ఈ దాడి చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసులు కూడా అసదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ రెడీ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, దాడి చేసిన వారిని తాను అడ్డుకునేందుకే ప్రయత్నించానని, అంతేకానీ తాను వారిపై దాడి చేయలేదనేది అసదుద్దీన్ వాదన. ఆయన అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. గతంలో ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసిన అసదుద్దీన్ తాను నిరపరాధినంటూ చెప్పుకున్నారు. అయితే కోర్టులో ఇరు వర్గాల వాదనలను విన్న తరవాత ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. అదే తరహాలో అప్పటి నుంచి కేసు వాయిదా పడుతూనే వస్తోంది. కానీ అసద్ మాత్రం కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఆయనపై ఆగ్రహించిన కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.




ఏపీ లో నామినేషన్ వేయటానికి వస్తే ... అభ్యర్తికి చెదు అనుభవం...?

మహేష్ ని విడిచి రెండు రోజులు ఉండే శక్తి కూడా నాకు లేదు: నమ్రత

స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>