PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/thummanenid14d0453-0b37-4b0f-9529-113453884f95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/thummanenid14d0453-0b37-4b0f-9529-113453884f95-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం రాజ‌కీయం వేడెక్కింది. ముఖ్యంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు అధికార పార్టీ నాయ‌కులే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మరోవైపు.. టీడీపీ కూడా స్పీక‌ర్ వ్య‌వ‌హార శైలిపై గుర్రుగా ఉంది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న త‌ర‌చుగా రాజ‌కీయాలు మాట్లాడ‌డం, విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్న‌ర్ చేయ‌లేదు. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇదే జిల్లాకు చెందిన అచ్చెన్నspeaker tammineni;auto;view;district;assembly;mla;minister;cheque;letter;tdp;central government;ycp;dookudu;partyస్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!స్పీక‌ర్ త‌మ్మినేనికి ఇంటా, బ‌య‌టా శ‌త్ర‌వులేగా... సిక్కోలులో కొత్త రాజ‌కీయం..!speaker tammineni;auto;view;district;assembly;mla;minister;cheque;letter;tdp;central government;ycp;dookudu;partyMon, 25 Jan 2021 13:15:00 GMT
శ్రీకాకుళం రాజ‌కీయం వేడెక్కింది. ముఖ్యంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు అధికార పార్టీ నాయ‌కులే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మరోవైపు.. టీడీపీ కూడా స్పీక‌ర్ వ్య‌వ‌హార శైలిపై గుర్రుగా ఉంది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న త‌ర‌చుగా రాజ‌కీయాలు మాట్లాడ‌డం, విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్న‌ర్ చేయ‌లేదు. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న నేప‌థ్యంలో స్పీక‌ర్‌కు చెక్ పెట్టే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

ఆముదాల వ‌లస నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన సీతారాం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నారు. అయితే..వైసీపీలో మాత్రం స్పీక‌ర్ వ్య‌వ‌హార శైలిపై సొంతపార్టీ నాయ‌కులు లోలోన విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో అధికార పార్టీ తీవ్ర సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంద‌ని, దీనిని చ‌ల్లార్చాల్సిన స్పీక‌ర్‌.. మ‌రింతగా రెచ్చ‌గొ ట్టేలా చేస్తున్నార‌ని.. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం వైసీపీ ఇంచార్జ్ కిల్లి కృపారాణి తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు.

త‌ర‌చుగా రాజ‌కీయాలు మాట్లాడడం ఏంటి ?  పార్టీ ప‌రువు పోతోంద‌ని ఆమె అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో స్పీక‌ర్ పేరు ఎత్త‌కుండానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
మ‌రోవైపు..టీడీపీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స్పీక‌ర్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించినా.. ఇక‌పై ఆయ‌న‌పైనా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్న‌వారు ఇలా రాజ‌కీయాలు మాట్లాడ‌డంపై త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. స్పీక‌ర్‌పై యుద్ధ‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

 స్పీక‌ర్ బంధువు, టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌ను దీనికి ఆయుధంగా వాడుకునేలా ప‌క్కా వ్యూహం సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో జిల్లా అభివృద్ది విష‌యంలోనూ వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>