EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jobs4922cc5e-46ad-4728-8f26-5480945fbe22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jobs4922cc5e-46ad-4728-8f26-5480945fbe22-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షించే నిరుద్యోగులు ఎందరో.. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్‌ 3, గ్రూప్ 4 వంటి ఉద్యోగాలపై ఆశలు పెట్టుకుని కోచింగ్ సెంటర్లలో నెలల తరబడి కోచింగ్ తీసుకునే ఉద్యోగార్థులు ఎందరో.. అయితే ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడటం ఆ పరీక్షలు పూర్తవడం అంత తర్వగా జరిగే వ్యవహారం కాదు.. అందులోనూ ఏపీపీఎస్సీ అంటే ఎన్నో కేసులు కారణంగా ఆలస్యం కామన్ అయ్యింది. అందుకే ఇలాంటి వారికి ఏపీ సర్కారు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందట. ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్‌ పరీక్షను తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్jobs;andhra pradesh;court;good news;good newwzఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?jobs;andhra pradesh;court;good news;good newwzMon, 25 Jan 2021 23:00:00 GMT
అందుకే ఇలాంటి వారికి ఏపీ సర్కారు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందట. ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్‌ పరీక్షను తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆలోచిస్తోందట.  అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితంగా చేపట్టాలన్న ఉద్దేశంతో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడం మంచిదన్న చర్చ  కమిషన్‌లో నడుస్తోందట. ఒక వేళ ప్రభుత్వం కూడా ఈ పద్ధతికి అంగీకారం తెలిపితే.. ఇకపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్ పరీక్షను తీసేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్వహిస్తున్న విధానంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి పోస్టుల భర్తీకి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతోంది. కోర్టుల్లో కేసులు దాఖలైతే ఈ గడువు మరింతగా  పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త విధానం ద్వారా ప్రిలిమ్స్‌ తీసేయడం వల్ల అభ్యర్థులకు, కమిషన్‌కూ కాలం కలిసొస్తుంది. ఉద్యోగాల భర్తీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు  అవకాశం దక్కుతుంది.


దీనిపై ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నది ఏంటంటే.. ప్రిలిమ్స్‌ను తొలగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి విన్నపాలు వచ్చాయట.  రెండంచెల వ్యవస్థ వల్ల శిక్షణకు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నామని, సమయాన్ని కేటాయించలేకపోతున్నామని అభ్యర్థుల నుంచి కూడా విజ్ఞప్తులొచ్చాయట. కమిషన్  వీటిని పరిశీలిస్తోందట. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటనలిచ్చేనాటికి దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని తీసుకునే ఛాన్స్ ఉందట. అయితే ఇదేమీ ఫైనల్ కాదు.. దీనిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఫైనల్‌ గా ఏం చేస్తారో.. చూడాలి.




అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>