PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/will-local-body-elections-will-go-on-smoothlye19d5330-6493-4f01-86c5-6955b2a03580-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/will-local-body-elections-will-go-on-smoothlye19d5330-6493-4f01-86c5-6955b2a03580-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర కాకరేపుతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది.అయితే, జిల్లా అధికార యంత్రంగం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్ ఇచ్చేట్లే కనిపిస్తోంది., ఇంతవరకూ నోటిఫికేషన్ వెలువడిన ఏ ప్రాంతంలో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరగలేదని తెలుస్తోంది.జిల్లా యంత్రాంగాలన్నీ దాదాపుగా చేతులెత్తేశాయి. జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయnimmagadda;kumaar;suma;suma kanakala;hyderabad;telugu desam party;vijayawada;andhra pradesh;district;telugu;government;panchayati;court;partyనిమ్మగడ్డకు షాక్...ఎన్నికల నామినేషన్స్ పై సందిగ్ధత ...?నిమ్మగడ్డకు షాక్...ఎన్నికల నామినేషన్స్ పై సందిగ్ధత ...?nimmagadda;kumaar;suma;suma kanakala;hyderabad;telugu desam party;vijayawada;andhra pradesh;district;telugu;government;panchayati;court;partyMon, 25 Jan 2021 10:37:27 GMTపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర కాకరేపుతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు  సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది.అయితే, జిల్లా అధికార యంత్రంగం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్  ఇచ్చేట్లే కనిపిస్తోంది., ఇంతవరకూ నోటిఫికేషన్ వెలువడిన ఏ ప్రాంతంలో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జరగలేదని తెలుస్తోంది.జిల్లా యంత్రాంగాలన్నీ దాదాపుగా చేతులెత్తేశాయి. జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. నామినేషన్లకు ముందు అందుబాటులో ఉండబోమని సిబ్బంది చెబుతున్నారు.నేడు నామినేషన్లు వేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేయగా, వాటిని స్వీకరించేందుకు కూడా అధికారులు అందుబాటులో లేరని సమాచారం.

మరోవైపు... పంచాయతీ ఎన్నికలపై ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది... హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో ఆస్తికరంగా మారింది. అయితే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.. ఆ తర్వాత ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.ఎన్నికలను సజావుగా జరిపించేందుకు సంబంధిత అన్ని వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం సహకరించేందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వంతో పాటు, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు, జడ్బీ సీఈవోలకు ఉత్తర్వులు వెళ్తున్నాయి. కానీ వారి నుంచి ఎన్నికల కమిషన్ కు ఏ విధమైన సమాచారం అందడం లేదు.రిటర్నింగ్ అధికారులు బాధ్యతలు తీసుకోకపోతే, ఆ భాధ్యత ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దేనని ఆ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు.ఎస్ఈసీ రమేష్ కుమార్ శనివారం తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికార హాజరు కాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు మీద సందిగ్ధత నెలకొంది.


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>