PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-leaders-troubled-on-tdp-leaders-joinings-in-ysrcp16cb7313-82be-414d-a7d7-75277897f12e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-leaders-troubled-on-tdp-leaders-joinings-in-ysrcp16cb7313-82be-414d-a7d7-75277897f12e-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన ద‌రిమిలా.. అత్యంత కీల‌క‌మైన కృష్ణాజిల్లాలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య పోరు మ‌రింత పెరిగింది. జిల్లాలోని మొత్తం 53 మండ‌లాల్లో 970 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. గ‌త 2013 ఎన్నిక‌ల్లో మెజారిటీ పంచాయ‌తీల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌గానికిపైగా పంచాయతీల్లో బ‌ల‌మైన వైసీపీ నాయ‌కులు ప్రాతినిధ్యం ఉండ‌డంతో ఆయా పంచాయ‌తీల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ ‌నే వాద‌న బ‌లంగా వినిపtdp ycp;krishna river;district;assembly;letter;tdp;ycp;partyఆ జిల్లాలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా..!ఆ జిల్లాలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా..!tdp ycp;krishna river;district;assembly;letter;tdp;ycp;partyMon, 25 Jan 2021 13:30:00 GMTరాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన ద‌రిమిలా.. అత్యంత కీల‌క‌మైన కృష్ణాజిల్లాలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య పోరు మ‌రింత పెరిగింది. జిల్లాలోని మొత్తం 53 మండ‌లాల్లో 970 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. గ‌త 2013 ఎన్నిక‌ల్లో మెజారిటీ పంచాయ‌తీల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌గానికిపైగా పంచాయతీల్లో బ‌ల‌మైన వైసీపీ నాయ‌కులు ప్రాతినిధ్యం ఉండ‌డంతో ఆయా పంచాయ‌తీల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

అదేస‌మ‌యంలో టీడీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో నాయ‌కులు ఓడిపోయినా.. గ్రామ‌స్థా యిలో మాత్రం పార్టీ బ‌లంగానే ఉంది. ముఖ్యంగా గుడివాడ‌, కైక‌లూరు, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రామ పంచాయ‌తీల్లో టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉంది. కొన్ని కొన్ని చిన్న‌పాటి వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ.. నాయ ‌కులు వాటిని స‌రిచేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయా గ్రామ పంచాయ‌తీల్లో రాజ‌కీయాల‌ను స‌రిదిద్దేందుకు వ‌ర్ల‌రామ‌య్య‌, బుద్దావెంక‌న్న‌వంటి షార్ప్ షూట‌ర్ల‌ను చంద్ర‌బాబు రంగంలోకి దించారు.

నెల కింద‌ట నుంచే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించిన చంద్ర‌బాబు.. ఈ దిశ‌గా చేప‌ట్టిన చ‌ర్య‌లు ఫ‌లితం ఇచ్చేలా ఉన్నాయి.
దీంతో కృష్ణా జిల్లాలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పోరు జోరుగా సాగే అవ‌కాశం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో తీవ్ర వివాదాలు, విభేదాలు ఈ జిల్లాలో రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేశాయి. ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా కూడా మ‌రిం త వేడెక్కే అవ‌కాశం ఉంది.

పంచాయ‌తీల్లో బ‌ల‌మైన శ‌క్తిగా ఉంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దోహ‌ద ‌ప‌డుతుం ద‌ని పార్టీలు భావిస్తున్న నేప‌థ్యంలో వైసీపీ.. టీడీపీలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయ‌తీల్లో స‌గమైనా త‌మ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప్ర‌జానాడి ఎలా ఉందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  


బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

స్థానికంలో కొత్త సంత‌.. నిమ్మ‌గ‌డ్డ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దా ?

మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>