Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime072a44af-79cd-4665-987f-a0512e4ed897-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime072a44af-79cd-4665-987f-a0512e4ed897-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో యువత చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతున్నారు. చాలా చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలకు వెళుతున్నారు. ఎందరో కన్నతల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. కారణం ఏదైనా కానివ్వండి.. వాటికి పరిష్కార మార్గాలను వెతక్కుండా.. ఏకంగా మరణాసిద్ధమవుతున్నారు. అమ్మానాన్న తిట్టారనో.. లేక చదువులో రాణించలేకపోతున్నాననో.. అడిగింది కొనివ్వడం లేదనో.. ఏదో ఒక కారణం చేత బలవన్మరణాకు పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.crime;rani;district;smart phone;police;driver;ee rojulloగర్ల్ ఫ్రెండ్ ఫోన్ కట్ చేసిందని ఓ యువకుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..గర్ల్ ఫ్రెండ్ ఫోన్ కట్ చేసిందని ఓ యువకుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..crime;rani;district;smart phone;police;driver;ee rojulloMon, 25 Jan 2021 17:19:29 GMTఈ రోజుల్లో యువత చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురవుతున్నారు. చాలా చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలకు వెళుతున్నారు. ఎందరో కన్నతల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. కారణం ఏదైనా కానివ్వండి.. వాటికి పరిష్కార మార్గాలను వెతక్కుండా.. ఏకంగా మరణాసిద్ధమవుతున్నారు. అమ్మానాన్న తిట్టారనో.. లేక చదువులో రాణించలేకపోతున్నాననో.. అడిగింది కొనివ్వడం లేదనో.. ఏదో ఒక కారణం చేత బలవన్మరణాకు పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ కట్ చేసిందనే కారణంతో ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్యే చేసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ కు గబ్బాడ గ్రామానికి చెందిన ఓ యువతికి పరిచయం ఏర్పడింది. వీరు తరచుగా కలుస్తూ.. ఫోన్లు మాట్లాడుకునే వారు. అయితే కొన్ని రోజుల కిందటే వీరి మధ్యన ఒక చిన్న గొడవ జరిగింది. దీంతో ఆ యువతి రమేష్ ఫోన్ ను లిఫ్ట్ చెయ్యడం మానేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ నేను చనిపోవాలనుకుంటున్నానని ఈ నెల 21వ తారీఖున తన స్నేహితులకు కూడా మెసేజ్ చేశాడు.

 అయితే రమేష్ రెండు మూడు రోజల నుంచి తరచూ ఇలాంటి మెసేజ్ లే పంపాడు. దాంతో వారు వారు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేసారు. కాగా ఈ క్రమంలోనే రమేష్ నర్సీపట్నం సమీపంలోని ఓ జీడి పండ్ల తోటలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు. ఈ క్రమంలో రమేష్ కు ఆ యువతికి మధ్యన అసలు ఏం జరిగిందన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఈ కేసులో రమేష్ తో మాట్లాడిన ఆ యువతిని కూడా విచారించే అవకాశమున్నట్టు సమాచారం. కాగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకొని కన్నోళ్లకు కన్నీళ్లు మిగిల్చవద్దని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>