MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heros-avoiding-anushka-and-samanthac3e71154-45b1-4fa2-bb05-06f49a7cfe1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heros-avoiding-anushka-and-samanthac3e71154-45b1-4fa2-bb05-06f49a7cfe1e-415x250-IndiaHerald.jpgఅనుష్క శెట్టి, సమంత అక్కినేని ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో అగ్రహీరోయిన్లు గా కొనసాగుతున్నారు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను చురగొన్న సమంత ఆ తర్వాత తన కెరీర్ లో వెనుదిరిగి చూడకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. anushka and samantha;sharwanand;anoushka;anushka;madhavan;gunasekhar;maya;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;film industry;industry;hero;chitramటాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?anushka and samantha;sharwanand;anoushka;anushka;madhavan;gunasekhar;maya;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;film industry;industry;hero;chitramMon, 25 Jan 2021 11:00:00 GMTఅనుష్క శెట్టి, సమంత అక్కినేని ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో అగ్రహీరోయిన్లు గా కొనసాగుతున్నారు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను చురగొన్న సమంత ఆ తర్వాత తన కెరీర్ లో వెనుదిరిగి చూడకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పిస్తున్నారు. వెబ్ సిరీస్ లలో కూడా సమంత నటించారు. అయితే ఆమె ఏ సినిమాలో నటించినా.. ఆమెకే ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుంది కానీ కో - యాక్టర్లకు ఎటువంటి గుర్తింపు దక్కడం లేదు. ఉదాహరణకు ఆమె నటించిన జాను చిత్రంలో హీరో శర్వానంద్ కి చాలా తక్కువ గుర్తింపు దక్కింది. జాను సినిమాని సమంతా సినిమా అని అన్నారు తప్ప శర్వానంద్ సినిమా అని ఎవరూ అనలేదు.

ఈ విధంగా సమంత తాను నటించిన ప్రతి సినిమాలో హైలెట్ గా నిలుస్తూ.. తనతో నటించే వారి ప్రాముఖ్యతను కూడా సొంతం చేసుకుంటున్నారు. అందుకే సమంత నటిస్తున్న సినిమాల్లో నటించడానికి అగ్ర హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు తీవ్ర విముఖత చూపుతున్నారు. తమకు కెరీర్ పరంగా ఒరిగేదేమీ ఉండదని చెబుతూ సమంతా నటిస్తున్న సినిమాలను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో సమంతా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో దుష్యంతుడి రోల్ లో ఒక హీరో ని ఫిక్స్ చేయాలని గుణశేఖర్ ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ టాలీవుడ్ హీరోలు మరో ఆలోచన లేకుండా శాకుంతలం సినిమాని రిజెక్ట్ చేశారు. దీనితో చేసేదేమీలేక ఒక మలయాళ యాక్టర్ ని దుష్యంతుడి పాత్ర కోసం గుణశేఖర్ సెలక్ట్ చేసుకున్నారని సమాచారం.

అనుష్క శెట్టి తో కూడా అగ్రహీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు నటించడానికి ఆసక్తి చూపడం లేదు. నిశ్శబ్దం సినిమాలో అనుష్క కి మాత్రమే పేరొచ్చింది కానీ మాధవన్ కి ఎటువంటి గుర్తింపు లభించలేదు. అలాగే అనుష్క నటించిన ప్రతి సినిమాలో ఆమెకు తప్ప తమకు కెరీర్ పరంగా ఏమీ ఒరగదని టాలీవుడ్ హీరోలు భావిస్తూ ఆమెను దూరంగా పెడుతున్నారు. ఏది ఏమైనా తమ అద్భుతమైన నటనా ప్రతిభ తో అగ్రహీరోలను సైతం సమంత, అనుష్క భయపెట్టడం గమనార్హం.


అప్పులు సరే... ఆస్తులు ఏవి జగనోరు...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>