MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/jayalalitha-opens-up-about-her-married-life034a7d72-d3b5-4a98-88d0-ba68484ac270-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/jayalalitha-opens-up-about-her-married-life034a7d72-d3b5-4a98-88d0-ba68484ac270-415x250-IndiaHerald.jpgకృష్ణ జిల్లా గుడివాడ లో పుట్టి పెరిగిన జయలలిత డిగ్రీ చదువుకొని నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. ఆమె ఏకంగా వెయ్యి నాటకాల్లో నటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ లో 650 పైగా సినిమాల్లో నటించారుjayalalitha;mahesh;bharath;bhaskar;jayalalitha;jeevitha rajaseskhar;krishna;amarnath cave temple;sri bharath;district;cinema;baba bhaskar;tamil;marriage;kannada;degree;hindi;interview;husband;heroineఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలితఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలితjayalalitha;mahesh;bharath;bhaskar;jayalalitha;jeevitha rajaseskhar;krishna;amarnath cave temple;sri bharath;district;cinema;baba bhaskar;tamil;marriage;kannada;degree;hindi;interview;husband;heroineMon, 25 Jan 2021 18:00:00 GMTకృష్ణ జిల్లా గుడివాడ లో పుట్టి పెరిగిన జయలలిత డిగ్రీ చదువుకొని నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. ఆమె ఏకంగా వెయ్యి నాటకాల్లో నటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ లో 650 పైగా సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటించారు. 2018 లో మహేష్ బాబు హీరోగా నటించిన "భరత్ అనే నేను" సినిమా లో స్పీకర్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె సీరియళ్ళలో నటిస్తూ జీవనం సాగిస్తున్నారు.

అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను తన 30ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో ఎన్నో కష్టాలను అనుభవించాలని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఆమె తన భర్త కారణంగా నరక యాతన అనుభవించారట. తన భర్త పేరు వినోద్ అని.. ఆయన మలయాళం సినిమాలకు దర్శకత్వం వహించే వారిని ఆమె ఇంటర్వ్యూ లో తెలిపారు. అయితే తన భర్త భక్తి రస సినిమాలతో పాటు బూతు సినిమాలు కూడా రూపొందించేవారని.. అందులో హీరోయిన్ గా తాను నటించానని ఆమె చెప్పి షాక్ ఇచ్చారు. వినోద్ తో దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపానని.. కానీ ఒకానొక సమయం తరువాత వినోద్ పై తనకు అనుమానం వచ్చిందని అందుకే అతన్ని దూరంగా పెట్టానని ఆమె అన్నారు.

అయితే వినోద్ మాత్రం తనని వదిలిపెట్టలేదని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం తో అతన్ని పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తన పెళ్లికి తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని.. దీంతో తన ఆస్తినంతా తీసుకొని.. పెళ్లి కోసం నగలను కూడా సొంత డబ్బులతోనే కొనుగోలు చేసి కొచ్చిలో వినోద్ ని పెళ్లి చేసుకున్నాను అని ఆమె చెప్పారు.

అయితే పెళ్లయిన ఆరు నెలలకే తన అనుమానం నిజమయిందని ఆమె చెప్పారు. తన ఆస్తినంతా తన భర్త లాక్కొని.. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చుకున్నాడు అని ఆమె అన్నారు. ఆ తర్వాత తనని చిత్రహింసలు పెట్టాడని దీంతో ఏడాది లోపే తన భర్త నుంచి తాను విడిపోయానని ఆమె అన్నారు. అయితే మళ్ళీ ఎవరినీ పెళ్లి చేసుకోని జయలలిత ప్రస్తుతం తన బావ భాస్కర్ తో కలిసి ఉంటున్నారు.


దారుణం.. భార్య అలాంటి పని చేసిందని భర్త బలవన్మరణం..

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>