PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgకేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు... తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ తలపెట్టిన అన్నదాతలు.. మరో ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు వరకు పాద యాత్ర చేస్తామని తెలిపారు.farmers protest;delhi;ghaziabad;parliment;february;central government;yatraపార్లమెంట్ మార్చ్ కు రైతుల పిలుపుపార్లమెంట్ మార్చ్ కు రైతుల పిలుపుfarmers protest;delhi;ghaziabad;parliment;february;central government;yatraMon, 25 Jan 2021 21:00:23 GMTకేంద్ర సర్కార్ తీసుకొచ్చిన  కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు... తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో వేలాది ట్రాక్టర్లతో ర్యాలీ తలపెట్టిన అన్నదాతలు.. మరో ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు వరకు పాద యాత్ర చేస్తామని తెలిపారు.

         దేశం నలుమూలల నుంచి ఢిల్లీలోని టాక్టర్ల ర్యాలీ వచ్చిన వారు తిరిగి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు క్రాంతికారి కిసాన్ సంఘం నేత దర్శన్ పాల్.  తమతో  కలిసి ఆందోళన కొనసాగిస్తామంటున్నారని,. అందుకే బడ్జెట్ సెషన్ సందర్భంగా ఫిబ్రవరి 1న పార్లమెంటు వరకు పాద యాత్ర చేయాలని నిర్ణయించామని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు దర్శన్ పాల్. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన తర్వతనే ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.రాజ్‌పథ్‌ మార్చ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలు సాగినట్లే రైతులు కూడా కొన్ని ట్రాక్టర్లను వివిధ ఆకృతులతో కూడిన శకటాలుగా రూపొందిస్తున్నారు. రైతు జీవనం, దేశానికి రైతు అవసరం, రైతుల దుస్థితి, సాగుచట్టాల వల్ల అనర్థాలు, మారుతున్న జీవన విధానాలు.. వీటన్నింటినీ వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు.

     మరో వైపు రైతుల ట్రాక్టర్ల ర్యాలీ కోసం ఢిల్లీలో మూడు మార్గాలను ఎంపిక చేశారు. మొదటిది సింఘు సరిహద్దు నుంచి ఖర్ఖోడా టోల్ ప్లాజా వరకు 63కి.మీల మార్గం. రెండోది టిక్రీ సరిహద్దు నుంచి అసోడా టోల్ ప్లాజా వరకు 62 కిలోమీటర్ల మార్గం. ఘజియాబాద్ నుంచి లాల్ ఖౌన్ వరకు సాగే 68కిలో మీటర్ల మార్గం మూడోది. ఈ మూడూ కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రె్‌సవే వద్ద కలుస్తాయి. ఢిల్లీ నగరంలోనే 100 కి.మీ మేర ఇది సాగుతుంది.ఎన్ని ట్రాక్టర్లు ఏఏ పాయింట్ల నుంచి వస్తాయన్నది ముందుగానే నిర్ధారిస్తారు. ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడ అవుట్ పాయింట్లు పెట్టారు. ట్రాక్టర్లు ఆయా పాయింట్ల నుంచి తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 


ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం: ఎంపీ విజయసాయి రెడ్డి

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>