PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా... ఆసక్తికర చర్చ జరిగింది. జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వాయిదా వేశాయి అని రోహత్గి వివరించారు. supreme court;goa;andhra pradesh;west bengal - kolkata;panchayati;court;lawyer;mukul rohatgiవిచారణలో సుప్రీం కోర్ట్ ఏమంది...? ఎన్ని అభ్యంతరాలు...?విచారణలో సుప్రీం కోర్ట్ ఏమంది...? ఎన్ని అభ్యంతరాలు...?supreme court;goa;andhra pradesh;west bengal - kolkata;panchayati;court;lawyer;mukul rohatgiMon, 25 Jan 2021 17:35:06 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్ట్ ఏపీ ప్రభుత్వానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా... ఆసక్తికర చర్చ జరిగింది. జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ ధర్మాసనం విచారణ  జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వాయిదా వేశాయి అని రోహత్గి  వివరించారు.

కరోనా వ్యాక్సినేషన్‌ కోసం గోవాలో ఎన్నికలు వాయిదా వేసారు అని రోహత్గి తెలిపారు. సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారు అని వివరించారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అని తన వాదన వినిపించారు. ప్రతిసారీ ఎన్నికలు వాయిదాపడుతూ వస్తున్నాయి అని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ విధుల్లో భాగంగానే ఎన్నికల ప్రక్రియ అని జస్టీస్ సంజయ్ కౌల్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా? అని ప్రశ్నించారు.

‌ఏదో వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు అని అన్నారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం అని స్పష్టం చేసారు. ‌సింగిల్‌ జడ్జి తీర్పులో ఏముంది?.. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్‌ఈసీపై మీరు రాసిన విధానం మీ ఆలోచనలను తెలుపుతుంది అని సంజయ్ కౌల్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగ సంఘాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపింది. ‌కరోనా తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు అని పేర్కొన్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు అని అసహనం వ్యక్తం చేసారు. బెంగాల్ లో ఎన్నికల కోసం మేమే ఆదేశాలిస్తున్నాం అని అన్నారు. ఏపీలో ఎన్నికలు ఆపమని ఎలా చెప్పాలి? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో కోర్టు చెప్పాలా? అని ప్రశ్నించారు. ‌ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు అని, కరోనా ఎక్కువున్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని జస్టిస్‌ కౌల్ ధర్మాసనం పేర్కొంది.


ఫుల్ జోష్ లో బాబోరు

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?

బ్రాహ్మణ ఘోష: స్వామి వారిని గుండెల్లో పెట్టుకున్న పూజారి కన్నీరు పెడితే జగనోరి నుంచి సమాధానం ఎక్కడ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>