PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasai-reddyb1856b03-edc4-4e74-98ac-efaeece633af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasai-reddyb1856b03-edc4-4e74-98ac-efaeece633af-415x250-IndiaHerald.jpgప్ర‌త్యేక హోదా గురించి పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావిస్తామని రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌‌న్ మోహన్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న క్యాంపు కార్యాలయంలో జరిగిన వైయ‌స్ఆర్సీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం వివ‌రాల‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి మీడియాకు వివ‌రించారు. పార్ల‌మెంట్ సమావేశాల నేపథ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహం, విధి విధానాల‌ను, వివిధ అంశాల‌పై గౌర‌వ ముఖ్య‌మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారని చెప్పారు. vijayasai reddy;view;editor mohan;jagan;v vijayasai reddy;congress;mp;chief minister;parliment;central government;sv mohan reddy;reddy;v;partyప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం: ఎంపీ విజయసాయి రెడ్డిప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం: ఎంపీ విజయసాయి రెడ్డిvijayasai reddy;view;editor mohan;jagan;v vijayasai reddy;congress;mp;chief minister;parliment;central government;sv mohan reddy;reddy;v;partyMon, 25 Jan 2021 21:07:01 GMTప్ర‌త్యేక హోదా గురించి పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావిస్తామని రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌‌న్ మోహన్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న క్యాంపు కార్యాలయంలో జరిగిన వైయ‌స్ఆర్సీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం వివ‌రాల‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి మీడియాకు వివ‌రించారు. పార్ల‌మెంట్ సమావేశాల నేపథ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహం, విధి విధానాల‌ను, వివిధ అంశాల‌పై గౌర‌వ ముఖ్య‌మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన రూ.1,569 కోట్లు బ‌కాయిలు రాబ‌ట్టే విష‌యంలో, ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం ఏదైతే గ‌తంలో రివిజ‌న్ క‌మిటీ నిర్ణ‌యించిన‌  రూ.55,656 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించేటట్లు పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించ‌డం జ‌రుగుతుందని చెప్పారు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో గ‌తంలో చంద్ర‌బాబు ఒప్పుకున్న కార‌ణంగా రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం కొంత ఆలస్యం చేయ‌డం జ‌రిగిందని, దీనికి చంద్ర‌బా‌‌బే పూర్తి కార‌కుడని ఎంపీ తెలిపారు. 
                          16 మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని, వాటిలో ఇప్ప‌టికే 3 కాలేజీల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట్ స‌భ్యుల కృషితో ఆ మూడు కాలేజీల‌కు నిధులను కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక బ‌ద్దంగా ఇస్తుందని చెప్పారు. మిగ‌తా 13 కాలేజీల విష‌యంలో కూడా తమ పార్ల‌మెంట్ స‌భ్యులు కృషి చేసి, తీసుకురావడం జ‌రుగుతుందన్నారు. ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ‌కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.4,282కోట్ల బ‌కాయిలు ఇవ్వాల్సిందిగా పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించ‌డం జ‌రుగుతుందని విజయసాయి రెడ్డి తెలియజేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన 1,842 కోట్ల రుపాయిలు కేంద్రం  చెల్లించాల్సిందిగా పార్ల‌మెంట్ లో డిమాండ్ చేయ‌బోతున్నామని చెప్పారు. నివ‌ర్ తుఫాన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న వాటికి సంబంధించి పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు తాత్కాలికంగా ప్రభుత్వం ఏవైతే చ‌ర్య‌లు చేపట్టిందో దానికి ఎన్డీఆర్ఎఫ్ ప‌థ‌కం కింద రూ.2,255 కోట్లు రాష్ట్రానికి రావాల్సివుందని,  దీనిపై పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు.


ఉద్యోగులను టార్గెట్ చేసిన టీడీపీ సీనియర్లు

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>