PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar4ff09c52-584e-4228-aa18-df2131006406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumar4ff09c52-584e-4228-aa18-df2131006406-415x250-IndiaHerald.jpgసోమవారం ఉదయం 10 గంటలకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ వైపుగా ఎలాంటి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది.నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి రిటర్నింగ్‌ అధికారులను నియమించాల్సిన జిల్లా కలెక్టర్లు.. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్లు ఎవరూ స్వీకరిస్తారు.. ఎక్కడ స్వీకరిస్తారు అన్నది తేలడం లేదు.nimmagadda ramesh kumar;kumaar;jagan;andhra pradesh;district;panchayati;courtనామినేషన్లు స్వీకరించేది ఎవరు?నామినేషన్లు స్వీకరించేది ఎవరు?nimmagadda ramesh kumar;kumaar;jagan;andhra pradesh;district;panchayati;courtMon, 25 Jan 2021 09:14:54 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. సోమవారం  ఉదయం 10 గంటలకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ వైపుగా ఎలాంటి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది.నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి రిటర్నింగ్‌ అధికారులను నియమించాల్సిన జిల్లా కలెక్టర్లు.. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్లు ఎవరూ స్వీకరిస్తారు.. ఎక్కడ స్వీకరిస్తారు అన్నది తేలడం లేదు.

        ఇప్పటికీ జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయలేదు కలెక్టర్లు.ఎస్‌ఈసీ ఆదేశాలను పక్కనపెట్టి  ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు జరుగుతాయా లేదా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నామినేషన్ల దాఖలుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై  సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ సోమవారం మధ్యాహ్నం బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య మొదటి నుంచి వివాదమే నడుస్తోంది. గత మార్చిలో ఎన్నికలకు జగన్ సర్కార్ నిర్ణయించగా.. కరోనా కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పుడు ఎస్ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వగా.. సర్కార్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని చెబుతోంది. దీంతో వివాదం కోర్టులకు వెళ్లింది. ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేయగా.. హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కార్.

 





హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?

నగరిలో రోజాని ఇబ్బంది పెడుతుంది ఆ వైసీపీ నాయకుడేనా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>