PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/organs4b0c7a35-55ca-4554-a441-53455767c144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/organs4b0c7a35-55ca-4554-a441-53455767c144-415x250-IndiaHerald.jpgమానవ శరీరంలో ప్రతి అవయవం కూడా ముఖ్యమే అని మనకు తెలుసు. కానీ మానవ శరీరంలోని కొన్ని భాగాలు కోల్పోయినా మనిషి బతికేయొచ్చట. ఇక బ్రెయిన్ లాంటి ప్రధాన భాగం పనిచేస్తుండగా కొన్ని చిన్న అవయవాలు తొలగించినా మనిషి బ్రతకడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ అవయవాలేంటో తెలుసుకుందామా. organs;manu;tara;cancer;cholesterolశరీరంలో ఈ అవయవాలు లేకున్నా బతికేయొచ్చు.. అవేంటంటే..!?శరీరంలో ఈ అవయవాలు లేకున్నా బతికేయొచ్చు.. అవేంటంటే..!?organs;manu;tara;cancer;cholesterolMon, 25 Jan 2021 08:00:00 GMT
ఇక కడుపులో ఎడమ వైపు, రిబ్స్ వెనుక భాగంలో ఉండేదే ప్లీహం. ఏదైనా గాయం అయినప్పుడు దీనిని తొలగిస్తుంటారు. అది పక్కటెముకలకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి.. దీనిని తొలగించకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పొట్ట జీర్ణ ప్రక్రియకు కారణమైన యాసిడ్ ను రెడీ చేస్తుంది. ఒక్కోసారి క్యాన్సర్ లేదా ఏదైనా ట్రామా వచ్చినప్పుడు కడుపు భాగాన్ని తొలగిస్తుంటారు. ఇలా పొట్ట భాగం తొలగించినప్పుడు సర్జన్లు ఆ ప్రదేశంలో ఆసోఫగస్ ను చిన్న పేగులకు అడ్డంగా ఉంచుతారు.

అయితే మనుషుల్లో పునరుత్పత్తి చేసే అవయవాలు వృషణాలు, పిండాలు. ఇవి లేకుండా కూడా మనిషి బతికేయొచ్చు. సాధారణంగా ఆటలు ఆడే సమయంలో, ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు వృషణాలను తొలగిస్తారు. మహిళల్లోనూ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఓవరీస్ ను తప్పిస్తారు. ఆరు అడుగులు ఉండే ఈ పెద్ద పేగు వాటర్ ను విడుదల చేయడం లాంటివి చేస్తుంటుంది. క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు వచ్చినప్పుడు దీనిని తీసేయాలి. కాకపోతే మలవిసర్జనలో కొన్ని మార్పులు వస్తుంటాయి. సాఫ్ట్ ఫుడ్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది.

ఈ భాగం లివర్ కింద.. కడుపులో కుడివైపున ఉంటుంది. బైల్ లాంటి వాటిని నిల్వ ఉంచుతుంది. ఇవి కొవ్వును అరిగించడానికి ఉపయోగపడతాయి. అవి జీర్ణక్రియకు అవసరం లేకపోయినా అక్కడే ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఈ బైల్స్ కారణంగా గాల్ స్టోన్స్ ఏర్పడతాయి. ఫలితంగా పైపుల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది. అప్పుడు పిత్తాశయం తొలగించాల్సిందే.

ఇక అపెండిక్స్ మంచి బ్యాక్టీరియా సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కోసారి కడుపులో నొప్పి అని అపెండిక్స్ ను తొలగిస్తుంటారు. అలా జరిగితే మరోసారి కడుపులో నొప్పి రాదని కాదు. అలా చేయడం వల్ల మళ్లీ సమస్య రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరికీ రెండు కిడ్నీలే ఉంటాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే ఒక కిడ్నీతో బతికేయాల్సి వస్తుంది. ఫ‌లితంగా రక్తం ఫిల్టర్ చేయడానికి వాటర్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి ఒక్క దాంతో సరిపెట్టుకోవాలి. పలు కారణాలతో కిడ్నీ దెబ్బ తినే ప్రమాదముంది.


ఫిబ్రవరి 16న యాదాద్రి ముహూర్తం?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>