PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda8189c7fd-7215-4bc0-896a-2891f7761de3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda8189c7fd-7215-4bc0-896a-2891f7761de3-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక (పంచాయతీ) ఎన్నికలకు సంబంధించి ఒక రేంజ్లో రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు పెంచారు. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. nimmagadda;kumaar;andhra pradesh;panchayati;february;local languageఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణకై రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణకై రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్nimmagadda;kumaar;andhra pradesh;panchayati;february;local languageMon, 25 Jan 2021 20:10:00 GMTస్థానిక (పంచాయతీ) ఎన్నికలకు సంబంధించి ఒక రేంజ్లో రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు పెంచారు. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఉద్యోగులకు హడావుడి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలు యథావిధిగా ముందుగా ప్రకటించిన విధంగా జరుగుతాయి. అంటే, గతంలో రెండో ఫేజ్‌లో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు మొదటి దశలోనూ, 3, 4 దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో జరుగుతాయి. ఈ రోజు (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన మొదటి దశ షెడ్యూల్ మాత్రం నాలుగో దశకు మారింది.



 గత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. అంటే, తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ ఎన్నికల నిర్వహణకు అనుమతించింది.


పార్లమెంట్ మార్చ్ కు రైతుల పిలుపు

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>