MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpaf50c98c6-8dcf-44e6-85ed-a86fb089b110-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/pushpaf50c98c6-8dcf-44e6-85ed-a86fb089b110-415x250-IndiaHerald.jpgమిగతా భాషలతో పోలిస్తే మన టాలీ వుడ్‌లో మల్టీ స్టారర్‌ మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. విక్టరీ వెంకటేష్ వంటి హీరోలు అడపా దడపా మల్టీ స్టారర్ చిత్రాలు చేసినా వాటి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారి పోయింది. టాలీ వుడ్‌ హీరోలు కూడా మల్టీ స్టారర్‌ సినిమాలపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీ వుడ్‌లో మరో క్రేజీ మల్టీ స్టారర్‌ సినిమాకు రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్‌ నడుస్తోంది. alluarjun;venkatesh;allu arjun;puri jagannadh;sethu;vijay;india;cinema;tamil;director;joseph vijay;yatra;master;devarakonda'పుష్ప' తర్వాత.. ఆ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేసే ఆలోచనలో బన్నీ!'పుష్ప' తర్వాత.. ఆ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేసే ఆలోచనలో బన్నీ!alluarjun;venkatesh;allu arjun;puri jagannadh;sethu;vijay;india;cinema;tamil;director;joseph vijay;yatra;master;devarakondaMon, 25 Jan 2021 23:08:51 GMTవిక్టరీ వెంకటేష్ వంటి హీరోలు అడపా దడపా మల్టీ స్టారర్ చిత్రాలు చేసినా వాటి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారి పోయింది. టాలీ వుడ్‌ హీరోలు కూడా మల్టీ స్టారర్‌ సినిమాలపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే టాలీ వుడ్‌లో మరో క్రేజీ మల్టీ స్టారర్‌ సినిమాకు రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్‌ నడుస్తోంది.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, విజయ దేవరకొండ కలిసి ఓ మూవీలో కలిసి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. "యాత్ర" ఫేం మహేష్‌ వీ రాఘవ్‌ వీళ్లిద్దరి కోసం ఓ సరికొత్త స్క్రిప్టు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ దాదాపు ఫైనల్‌ అయినట్లేనట. ఈ సినిమాను బన్నీ వాసు, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మిస్తారని టాక్‌ నడుస్తోంది. 2021 చివర్లో ఈ మల్టీ స్టారర్‌ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్‌.... లెక్కల మాస్టర్ సుకుమార్‌తో "పుష్ప" సినిమా చేస్తున్నాడు.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలుసు కదా.

అయితే ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్‌ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఖరారు చేశారు. అటు విజయ్‌ దేవరకొండ కూడా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో‌ "లైగర్‌" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్‌ దశలోనే ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగానే వస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్‌, బన్నీ కాంబోలో సినిమా ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటనా రాలేదు.  


'క్రాక్' మూవీ ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన 'ఆహా' ....??

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>