Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rare-incident-in-bigbash-leaguefdd510b8-ce17-49bd-8465-1fb0e0a71c35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rare-incident-in-bigbash-leaguefdd510b8-ce17-49bd-8465-1fb0e0a71c35-415x250-IndiaHerald.jpgక్రికెట్‌లో కొన్నిసార్లు అనూహ్యమైన సంఘటలు చోటు చేసుకుంటుంటాయి. చరిత్రలో అలాంటి సంఘటన ఇంతకుముందెన్నడూ జరిగి ఉండదు. అలాగే ఇకముందు జరుగుతుందన్న నమ్మకమూ ఉండదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే కాదు దానిని చూసిన ప్రేక్షకులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతారు. అలాంటి ఓ సంఘటనే..big bash league;cricket;television;twitter;adelaide;icc t20;paruguఒకే బంతి.. రెండు రనౌట్లు.. బిగ్‌బ్యాష్‌ మ్యాచ్‌లో అరుదైన ఘటన!ఒకే బంతి.. రెండు రనౌట్లు.. బిగ్‌బ్యాష్‌ మ్యాచ్‌లో అరుదైన ఘటన!big bash league;cricket;television;twitter;adelaide;icc t20;paruguMon, 25 Jan 2021 15:24:58 GMTఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో కొన్నిసార్లు అనూహ్యమైన సంఘటలు చోటు చేసుకుంటుంటాయి. చరిత్రలో అలాంటి సంఘటన ఇంతకుముందెన్నడూ జరిగి ఉండదు. అలాగే ఇకముందు జరుగుతుందన్న నమ్మకమూ ఉండదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే కాదు దానిని చూసిన ప్రేక్షకులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతారు. అలాంటి ఓ సంఘటనే ఆదివారం జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ఒకే ఆటగాడు.. ఒకే బంతికి రెండుసార్లు రనౌటైన ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే ఓ విచిత్రమైన సంఘటనగా రికార్డులకెక్కింది.

అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య ఆదివారం 51వ టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా అడిలైడ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆడగా జేక్‌ వెదరాల్డ్‌(31) అనే బ్యాట్స్‌మన్‌ ఒకే బంతికి రెండుసార్లు రనౌటయ్యాడు. క్రిస్‌గ్రీన్‌ వేసిన 10వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఫిలిప్‌ సాల్ట్‌(31) ఒక బంతిని నేరుగా బౌలర్‌వైపే షాట్‌ ఆడాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న జేక్‌ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. అప్పటికే ఆ బంతి బౌలర్‌ చేతికి తాకుతూ వికెట్లను కొట్టేసింది. అసలేం జరిగిందో అర్థంకాని జేక్‌ ఆ బంతిని చూస్తూ అక్కడే నిలిచిపోయాడు. ఈలోపు షాట్‌ ఆడిన ఫిలిప్‌ సింగిల్‌ కోసం యత్నించాడు. ఆలస్యంగా స్పందించిన జేక్‌ కీపర్‌ వైపు పరుగెత్తగా ఆలోపే ఫీల్డర్‌ బంతిని అందుకొని కీపర్‌కు విసిరాడు. జేక్‌ క్రీజులోకి చేరేలోపే కీపర్‌ వికెట్లను గిరాటేశాడు.

టీవీ రీప్లేలో జేక్‌ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. అయితే, తొలుత బౌలర్‌ చేతికి బంతి తగిలి బెయిల్స్‌ ఎగరడంతో ఆ వికెట్‌ క్రిస్‌గ్రీన్‌ ఖాతాలో చేరింది. ఈ వీడియోను బిగ్‌బాష్‌ లీగ్‌ ట్విటర్‌లో పంచుకోగా అది వైరల్‌గా మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో చివరికి అడిలైడ్‌ జట్టే విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 159/6 స్కోర్‌ సాధించింది. ఈ 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్‌ 20 ఓవర్లకు 153/7 మాత్రమే చేయగలిగింది. దీంతో చివరకు అడిలైడ్‌ స్ట్రైకర్స్ 6 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
">

" style="height: 205px;">




ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!

సరికొత్త కాంబినేషన్లు నిజమైతే.. అభిమానులకు పండుగే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>