Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan0fb7355e-d899-4ba8-b742-8d6895682987-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan0fb7355e-d899-4ba8-b742-8d6895682987-415x250-IndiaHerald.jpgసుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇటీవలె పింక్ రీమేక్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టీజర్ విడుదలై కొన్ని రోజులే అయినా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం ప్లాన్స్ చేస్తున్నాడు పవన్. కాగా సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’సినిpavan kalyan;beauty;pawan;rana;pooja hegde;kalyan;pawan kalyan;cinema;january;remake;pink;dil;sai pallaviపవన్ అభిమానులకు ఇక పండగే.. పవన్, రానా మూవీ షూటింగ్ షూరూ అయ్యిందిగా..పవన్ అభిమానులకు ఇక పండగే.. పవన్, రానా మూవీ షూటింగ్ షూరూ అయ్యిందిగా..pavan kalyan;beauty;pawan;rana;pooja hegde;kalyan;pawan kalyan;cinema;january;remake;pink;dil;sai pallaviMon, 25 Jan 2021 17:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇటీవలె పింక్ రీమేక్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టీజర్ విడుదలై కొన్ని రోజులే అయినా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ  సినిమా తర్వాత మరో సినిమా కోసం ప్లాన్స్ చేస్తున్నాడు పవన్. కాగా సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో మలయాళం సూపర్ డూపర్ హిట్  మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్డాడు పవన్ కళ్యాణ్.  
సినిమా  ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా ముగించేసింది. ఈ రీమేక్ సినిమా కోసం మాటల మాంత్రికుడు మాటలు అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలే ఏర్పడ్డాయి ప్రేక్షకులకు. కాగా ఈ చిత్ర యూనిట్ జనవరి 25 తేదీ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఇప్పనుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోనుందని అర్థమవుతోంది. వీలైనంత తొందరలోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.

కాగా ఈ రీమేక్ మూవీలో పవన్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇంకా సాయి పల్లవి విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది చివరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్స్ వేస్తున్నారట. అయితే చాలా రోజుల తర్వాత తెరముందుకు వస్తున్న పవన్ అభిమానులు ఈ సినిమా పట్ల భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరముందుకు వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. అందులోనూ పవన్, రానా కాంబినేషన్ చాలా స్పెషల్ గా మారింది. ఇంకేముంది ఈ సినిమా పట్ల సినీ ప్రేక్షకులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.




దారుణం.. భార్య అలాంటి పని చేసిందని భర్త బలవన్మరణం..

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....

R R R రిలీజ్ డేట్ ఎనౌన్స్‌.. టాలీవుడ్‌లో కొత్త వార్ మొద‌లైంది..!

వైరల్ అవుతున్న నందమూరి తాత మనవడి పెళ్లి ఫోటోలు

సోమిరెడ్డికి చిక్కులు.. పార్టీలోనే ఎగ‌స్పార్టీ..!

జ‌గ‌న్‌కు చాప‌కింద నీరుగా కాంగ్రెస్‌.. ఎదిగేందుకు వ్యూహం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>