WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-loss-hot-showerd372aa28-d7e4-4510-be2e-8cdc9bfebdf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-loss-hot-showerd372aa28-d7e4-4510-be2e-8cdc9bfebdf5-415x250-IndiaHerald.jpgజుట్టు ఆరోగ్యానికి, చర్మం అందంగా తయారవడానికి కొబ్బరి పాలు చాలా చక్కగా పనిచేస్తాయట. అది ఎలాగో ఓసారి చూద్దామా? 1. కొబ్బరి పాల వినియోగంతో వెంట్రుకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరి పాలలో ఉండే కొవ్వు, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, భాస్వరం, పొటాషియం కురులను చాలా పటిష్టంగా ఉంచుతాయి.hair;oil;bacteria;almondsఈ ఒక్క వస్తువుతో జుట్టు సమస్యలు అన్నీ మటాష్!.. అంతేకాదండోయ్..ఈ ఒక్క వస్తువుతో జుట్టు సమస్యలు అన్నీ మటాష్!.. అంతేకాదండోయ్..hair;oil;bacteria;almondsMon, 25 Jan 2021 10:15:00 GMT

1. కొబ్బరి పాల వినియోగంతో వెంట్రుకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరి పాలలో ఉండే కొవ్వు, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, భాస్వరం, పొటాషియం కురులను చాలా పటిష్టంగా ఉంచుతాయి.

2. కొబ్బరి పాలలో బి12, జింక్‌ వంటి  పోషక పదార్థాలు చాలా ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. దీంతో జుట్టు సమస్యలు తగ్గి శిరోజాల పెరుగుదలకు చాలా ఉపయోగకరం.
 
3. కొబ్బరిపాల వినియోగం వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గిపోతుంది. వెంట్రుకలు చిట్లిపోవు. పైగా పొడిజుట్టును నివారిస్తుంది.

4. చుండ్రు నుంచి రక్షణ లభిస్తుంది. బట్టతల రాకుండా కొబ్బరి పాలు కాపాడతాయి.

5. జుట్టులోని ప్రొటీన్లు పోకుండా ఉండేందుకు కూడా కొబ్బరిపాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు అతినీలలోహిత కిరణాల వల్ల శిరోజాలు దెబ్బ తినకుండా కూడా కొబ్బరిపాలు కాపాడతాయి.
 
6. జుట్టు పెరగడానికి కొబ్బరిపాలను నేరుగా  జుట్టుకు పట్టించొచ్చు. పావు కప్పు కొబ్బరిపాలను గోరువెచ్చగా వేడిచేసి పదిహేను నిమిషాలపాటు జుట్టు కుదుళ్లకు పట్టేలా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత షాంపూతో స్నానం చేయాలి. వారానికి ఒకసారి  ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
7. నిమ్మరసంలో సి విటమిన్‌ ఉంటుంది. దీన్ని కొబ్బరిపాలలో కలిపి తలకు మసాజ్‌ చేసుకుంటే కూడా వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అంతేకాదు జుట్టు  రాలడం బాగా తగ్గుతుంది.
 
8. పొడి బారిన జుట్టుకు కొబ్బరి పాలను పట్టిస్తే జుట్టు పట్టులా అందంగా మారుతుంది. వెంట్రుకలు చిట్లడం కూడా తగ్గుతుంది.
 
9. జుట్టుకు కండిషనర్‌లా కొబ్బరిపాలు ఉపయోగపడతాయి. షాంపూతో తలస్నానం చేశాక కొద్దిగా కొబ్బరిపాలను తలకు పట్టించి రెండు నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకుంటా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
 
10. ఒక టీ స్పూన్‌ కొబ్బరి పాలకు, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె కలిపి దానితో ముఖానికి మసాజ్‌ చేసుకుని దూదితో తుడిచేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే చర్మం జిడ్డుగా, మొటిమలతో ఉన్నా సరే తగ్గిపోతుందట. ఇలా నూనెలో కొబ్బరిపాలు కలిపి వాడడంతో చర్మంలోని చాలా చెడు బాక్టీరియా పోతుంది.

11. చర్మం ముడతలు రాకుండా, వయసు కనిపించకుండా చర్మాన్ని మృదువుగా, పట్టులా ఉండటానికి కొబ్బరిపాలు బాగా పని చేస్తాయి. బాదంపొడి, తేనె, కొబ్బరిపాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని రెండు నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మం చాలా మృదువుగా తయారవుతుంది


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>