PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritalaravi68bec33a-120c-4f4e-9ddc-70da8521f615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritalaravi68bec33a-120c-4f4e-9ddc-70da8521f615-415x250-IndiaHerald.jpg అనంతపురం రాజకీయాల గురించి మాట్లాడితే ముందుగా పరిటాల రవి గురించి చర్చ తప్పక వస్తుంది. అంతలా ఆ జిల్లా రాజకీయాలను ఆయన ప్రభావం చేశారు. కేవలం అనంతపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవికి అభిమానులు ఉన్నారు. అనంతపురంలో పరిటాల కుటుంబమే మొదటి నుంచి రాజ్యమేలుతూ వస్తోంది.paritalaravi;ravi anchor;sriram;ram madhav;mp;district;ananthapuram;mandalam;village;wife;anantapuram;tdp;paritala ravindra;ycp;kadiri;father;gharshana;paritala sunithaపరిటాల రవి ఫ్లెక్సీలను కాల్చేసిన దుండగులు.. పరిటాల రవి రాక్షసుడంటూ..పరిటాల రవి ఫ్లెక్సీలను కాల్చేసిన దుండగులు.. పరిటాల రవి రాక్షసుడంటూ..paritalaravi;ravi anchor;sriram;ram madhav;mp;district;ananthapuram;mandalam;village;wife;anantapuram;tdp;paritala ravindra;ycp;kadiri;father;gharshana;paritala sunithaMon, 25 Jan 2021 00:10:13 GMTపరిటాల రవి గురించి చర్చ తప్పక వస్తుంది. అంతలా ఆ జిల్లా రాజకీయాలను ఆయన ప్రభావం చేశారు. కేవలం అనంతపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవికి అభిమానులు ఉన్నారు. అనంతపురంలో పరిటాల కుటుంబమే మొదటి నుంచి రాజ్యమేలుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో పరిటాల కుటుంబాన్ని బలహీన పరిచేందుకు వైసీపీ ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తోంది. పరిటాల రవి రాక్షసుడు అంటూ హిందూ పురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

ఇక ఇప్పుడు అనంతపురంలో ఏర్పాటు చేసిన పరిటాల రవి ఫ్లెక్సీలను దుండగులు కాల్చేయడంతో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిటాల రవి 16వ వర్దంతి సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే కంబదూరం మండలంలోని కదిరి దేవరపల్లి గ్రామంలోనూ పరిటాల రవి అభిమానులు ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలకు నిప్పంటించి పారిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైసీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరుగుతోంది. పరిటాల రవి వర్దంతా సందర్భంగా జిల్లాలోని స్థూపం వద్ద ఆయన భార్య పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్ నివాళులర్పించారు. కాగా.. ఇటీవల పరిటాల శ్రీరామ్ తన కొడుకుకు తన తండ్రి పేరునే పెట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి పేరుతో కొడుకును పిలుస్తూ నామకరణోత్సవ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాగా.. గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి పరిటాల శ్రీరామ్ వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>