Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/roumors-say-that-sone-bhandar-caves-are-filled-with-lots-of-treasure2dde0cbc-a301-468e-9125-9c70ef7720db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/roumors-say-that-sone-bhandar-caves-are-filled-with-lots-of-treasure2dde0cbc-a301-468e-9125-9c70ef7720db-415x250-IndiaHerald.jpgఅంతుపట్టని రహస్యాలెన్నో మన చుట్టూ ఉన్నా మనం వాటిని కనిపెట్టడంలో శతాబ్దాలుగా వెనకపడిపోతునే ఉన్నాం. వేల కోట్ల సంపద ఉన్న అనేక ప్రాంతాలను కనిపెట్టినా ఆ సంపదను బయటకు ఎలా తీసుకురావాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. అలాంటి ఓ గుహ ఇటీవల బయటపడింది. అయితే ఆ గుహను ఎలా తెరవాలో ఇప్పటికీ..sone bhandar caves;manu;nidhi;sampada;kerala;police;local languageఆ గుహల్లో వేలకోట్ల సంపద.. ఎలా తెరవాలో తెలియక..ఆ గుహల్లో వేలకోట్ల సంపద.. ఎలా తెరవాలో తెలియక..sone bhandar caves;manu;nidhi;sampada;kerala;police;local languageMon, 25 Jan 2021 11:52:25 GMTఇంటర్నెట్ డెస్క్: అంతుపట్టని రహస్యాలెన్నో మన చుట్టూ ఉన్నా మనం వాటిని కనిపెట్టడంలో శతాబ్దాలుగా వెనకపడిపోతునే ఉన్నాం. వేల కోట్ల సంపద ఉన్న అనేక ప్రాంతాలను కనిపెట్టినా ఆ సంపదను బయటకు ఎలా తీసుకురావాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. అలాంటి ఓ గుహ ఇటీవల బయటపడింది. అయితే ఆ గుహను ఎలా తెరవాలో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియడం లేదు. దాదాపు రెండువేల సంవత్సరాలుగా అనేకమంది ఈ గుహను తెరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంది.

బీహార్‌ నలంద జిల్లాలోని రాజ్‌గిరి దగ్గర సోన్‌ భండార్‌ గుహలు ఉన్నాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ గుహల్లో లక్షల కోట్ల సంపద ఉందని ప్రచారం సాగుతోంది. ఇవి సహజంగా ఏర్పడినవి కావు. రెండు గుహలనూ మనుషులే తయారు చేశారు. అయితే ఇంత పెద్ద గుహలు ఎందుకు కట్టించారనే విషయంపై ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అంచనా వేయలేకపోతున్నారు.

దక్షిణ ఆసియాను పాలించిన మౌర్యుల కాలంలో ఈ గుహల నిర్మాణం జరిగి ఉంటుందని వారు చెబుతున్నారు. మరొకొందరేమో మహాభారత కాలపు మగధరాజు జరాసంధుడు ఈ గుహని కట్టించాడని, ఇంకొందరు బింబిసారుడు కట్టించాడని రకరకాలుగా చెప్పుకొంటుంటారు. అయితే భారీ ఎత్తున సామ్రాజ్యపు సంపదను దాచిపెట్టేందుకే ఈ గుహల్ని కట్టించారని, ఈ గుహలను ఎలాగైనా తెరిస్తే కచ్చితంగా కోట్ల కొద్దీ ధనరాసులు సొంతం అవుతాయని అనేకమంది నమ్ముతుంటారు.

కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో ఇప్పటికే కోట్ల కొద్దీ సంపద బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఆ సంపద కంటే ఈ సోన్‌ భండార్‌ గుహల్లో ఉన్న సంపద కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు పరిశోధనకులు మాత్రం ఈ ప్రచారం అంతా అబద్ధమని, ఈ గుహల్లో ఎలాంటి నిధి నిక్షేపాలూ లేవని చెబుతుంటారు. గోడలపై ఉన్న గుప్త లిపిని తాము డీకోడ్ చేశామని, అందులో ఇక్కడ ఎలాంటి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం లేదని  వారంటున్నారు. కానీ చాలా మంది ఈ మాటలను పట్టించుకోకుండా ఖజానాని తొలిచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ గుహల్లో సంపదను ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు ఇక్కడ నరబలులను కూడా ఇచ్చారట. దాదాపు 4 నరబలి సంఘటనలు ఇక్కడ జరిగినట్లు స్థానికులు చెబుతుంటారు. అయితే పోలీసులు మాత్రం ఈ పుకార్లను కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం ఈ గుహ బయట ఒక పార్క్‌ను ఏర్పాటు చేశారు. పగటి పూట చాలా ప్రశాంతంగా కనిపించే ఈ ప్రదేశం.. రాత్రిపూట భయాన్ని కలిగిస్తుంది.






బ్రాహ్మణ ఘోష : అందరి తలరాతను మార్చే 'బ్రాహ్మణుడి' తలరాత మారేదెన్నడో!

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>