Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/100rupees-notesc95d68da-78fe-444b-ba7b-2c632d87ea1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/100rupees-notesc95d68da-78fe-444b-ba7b-2c632d87ea1a-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా ఉన్న పాత వంద రూపాయల నోట్లు రద్దుకాబోతున్నాయా..? ఇక మీదట మన వద్ద ఉన్న పాత వంద నోట్లు చెల్లవా..? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టిస్తున్నాయి. పాత రూ.100 నోట్లు రద్దుకాబోతున్నాయంటూ ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చిన కొన్ని పుకార్లే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం త్వరలో పాత రూ.100 నోట్లను రద్దు చేయబోతోందని, ఇప్పటికే ఆర్బీఐ ఈ నోట్లను వెనక్కి తీసేసుకుంటోందని, వచ్చే రెండు నెలల కాలంలో..100rupees notes;sambandam;rbi;cheque;central governmentత్వరలో 100 నోట్ల రద్దు..? క్లారిటీ ఇచ్చిన పీఐబీ..!త్వరలో 100 నోట్ల రద్దు..? క్లారిటీ ఇచ్చిన పీఐబీ..!100rupees notes;sambandam;rbi;cheque;central governmentMon, 25 Jan 2021 10:36:55 GMTఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న పాత వంద రూపాయల నోట్లు రద్దుకాబోతున్నాయా..? ఇక మీదట మన వద్ద ఉన్న పాత వంద నోట్లు చెల్లవా..? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టిస్తున్నాయి. పాత రూ.100 నోట్లు రద్దుకాబోతున్నాయంటూ ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చిన కొన్ని పుకార్లే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం త్వరలో పాత రూ.100 నోట్లను రద్దు చేయబోతోందని, ఇప్పటికే ఆర్బీఐ ఈ నోట్లను వెనక్కి తీసేసుకుంటోందని, వచ్చే రెండు నెలల కాలంలో ఇక ఆ నోట్లు కనిపించవని, ఎవరి వద్దనైనా ఆ నోట్లు ఉంటే వెంటనే బ్యాంకుల్లో మార్చుకోవాలని చెబుతూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బ్యాంకుల్లో పాత వంద నోట్లను మార్చుకునేందుకు బారులు తీరుతున్నాయి.

2016లో కూడా కేంద్రం ఉన్నపళంగా పెద్దనోట్లను రద్దుచేసిందని, అదే తరహాలో ఇప్పుడు కూడా రూ.100 నోట్లను రద్దు చేయబోతోందని ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను కూడా మార్చ్ నెల లేదా ఏప్రిల్ నెలలోగా ఆర్బీఐ వెనక్కి తీసుకుంటుందని, ఆలోగా వాటిని మార్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వార్తలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లు సర్క్యులేషన్‌లో ఉండబోవన్న వార్తలను కొట్టిపారేసింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఈ నోట్లకు సంబంధంచి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.


ఇదిలా ఉంటే నాలుగేళ్ల క్రితం కేంద్రం పెద్ద నోట్లైన 500, 1000 నోట్లను తొలగించి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత 500 వందల నోట్ల కొత్త డిజైన్ ప్రింట్ చేసి విడదల చేసింది. ఇక వెయ్యి నోట్లను పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానంలో 2000వేల నోట్లను విడుదల చేసింది. ఆ తరువాత క్రమంలో 100, 50, 20, 10 నోట్లను కూడా కొత్త డిజైన్లలో విడుదల చేసింది.


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>