PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-tracters-rally3b10c88e-84a6-44b2-93e5-3b8d2f69925c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-tracters-rally3b10c88e-84a6-44b2-93e5-3b8d2f69925c-415x250-IndiaHerald.jpgఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లో మంగళవారం రైతులు తలపెట్టి ర్యాలీకి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు సరూర్నగర్ మైదానం నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు ప్రదర్శనకు పచ్చజెండా ఊపింది. farmers tracters rally;lakshman;delhi;hyderabad;cricket;haryana - chandigarh;rajasthan;telangana;high court;huzur nagar;police;job;uttar pradesh;wife;punjab;uppalహైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతిహైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతిfarmers tracters rally;lakshman;delhi;hyderabad;cricket;haryana - chandigarh;rajasthan;telangana;high court;huzur nagar;police;job;uttar pradesh;wife;punjab;uppalMon, 25 Jan 2021 20:41:58 GMTహైదరాబాద్ లో  మంగళవారం రైతులు తలపెట్టి ర్యాలీకి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు సరూర్నగర్ మైదానం నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు ప్రదర్శనకు పచ్చజెండా ఊపింది.  

        ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా ఇందిరాపార్కు నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించేందుకు  ఆలిండియా కిసాన్ సంఘర్షణ్ సమన్వయ కమిటీ హైదరాబాద్ పోలీసులకు దరఖాస్తు చేసింది. పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అత్యవసర విచారణ జరిపారు. సరూర్ నగర్ మైదానం నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ర్యాలీలో 300 వాహనాలు మించరాదని స్పష్టం చేసింది. ర్యాలీలో ట్రాక్టర్లు ఉండకూడదని షరతు విధించింది.
 
        గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో ర్యాలీకి దండుగా కదలివస్తున్నారు రైతులు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లే దారులన్ని రైతులతో వస్తున్న ట్రాక్టర్లతో నిండిపోయాయి. వేలాది ట్రాకర్లలో రైతులు ర్యాలీగా హస్తినకు వస్తున్నారు. దీంతో వందలాది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి ఢిల్లీకి ఎంటరయ్యే సరిహద్దులకు ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు చేరుకున్నాయి. ఇంకా వేలాదిగా తరలివస్తున్నాయి. దీంతో గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు జరప తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ టెన్షన్ పుట్టిస్తోంది.

    రైతుల ట్రాక్టర్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన తరువాతే అంటే ఉదయం 11-30 గంటల తరువాతే ట్రాక్టర్‌ ర్యాలీ ఆరంభం కావాలి. పోలీసుల షరతులకు రైతులు కూడా అంగీకరించి.. వాళ్ల రూట్ మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే ముగిశాకే.. రైతుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లోని బ్యారికేడ్లను తొలగిస్తారు


ఉద్యోగులను టార్గెట్ చేసిన టీడీపీ సీనియర్లు

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>