PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eenadu9d342a39-3426-43fd-b8c2-712b93388c88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eenadu9d342a39-3426-43fd-b8c2-712b93388c88-415x250-IndiaHerald.jpgఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకూ.. ఏపీ సీఎం జగన్ కూ మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఏపీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల నిర్వహణపై ఆయన ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను అధికారులు చెత్త బుట్టలో పడేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికలు పెడితే మా పరిస్థితి ఏంటంటూ ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. వైసీపీ నేతలు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కరోనా లాక్‌డౌన్‌ అనంతరం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ, అసెంబ్లీ, పంచాయతీ, eenadu;jagan;andhra pradesh;chhattisgarh;karnataka - bengaluru;odisha;rajya sabha;district;january;panchayati;assembly;november;local language;central government;ycp;chief commissioner of electionsజగన్ సర్కారు కళ్లు తెరిపించేలా... 'ఈనాడు' కథనం..!?జగన్ సర్కారు కళ్లు తెరిపించేలా... 'ఈనాడు' కథనం..!?eenadu;jagan;andhra pradesh;chhattisgarh;karnataka - bengaluru;odisha;rajya sabha;district;january;panchayati;assembly;november;local language;central government;ycp;chief commissioner of electionsMon, 25 Jan 2021 10:00:00 GMTఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకూ.. ఏపీ సీఎం జగన్ కూ మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఏపీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల నిర్వహణపై ఆయన ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను అధికారులు చెత్త బుట్టలో పడేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికలు పెడితే  మా పరిస్థితి ఏంటంటూ ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. వైసీపీ నేతలు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కరోనా లాక్‌డౌన్‌ అనంతరం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ, అసెంబ్లీ, పంచాయతీ, పట్టణ సంస్థలకు ఎన్నికలు నిరాటంకంగా జరిగాయంటూ ఈనాడు పత్రిక ఓ ఆసక్తికరమైన కథనం ప్రచురించింది.

కేంద్ర ఎన్నికల సంఘం జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందని... నాటి నుంచి నేటి వరకూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయని ఈనాడు రాసింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రాజ్యసభకు, అయిదు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకల్లో శాసన మండలికి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేసింది.

అక్టోబరు 28 నుంచి నవంబరు 7 వరకు మూడు దశల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. నవంబరు 3న మధ్యప్రదేశ్‌లో 28, గుజరాత్‌లో 8, ఉత్తర్‌ప్రదేశ్‌లో 7, ఝార్ఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండేసి స్థానాల్లో, ఛత్తీస్‌గఢ్‌, హరియాణాల్లో ఒక్కో స్థానంలో, తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయని ఈనాడు రాసింది. నవంబరు7న మణిపుర్‌లో 5అసెంబ్లీ స్థానాలకు, బిహార్‌లోని వాల్మీకీనగర్‌ లోక్‌సభస్థానానికి ఉపఎన్నికలు, నవంబరు 9న ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగింది.

ఇంతేనా.. నవంబరు 23, 27, డిసెంబరు 1,5 తేదీల్లో నాలుగు దశల్లో రాజస్థాన్‌లో 21 జిల్లా పంచాయతీలకు... డిసెంబరు 1న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు, 8 నుంచి 14వరకు కేరళలో స్థానిక సంస్థలకు, 11న రాజస్థాన్‌లో 50 పట్టణ స్థానిక సంస్థలకు, 22, 27 తేదీల్లో కర్ణాటకలో రెండు దశల్లో 5762 గ్రామ పంచాయతీలకు.. జనవరి 15న మహారాష్ట్రలో 14,234 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఈనాడు గుర్తు చేసింది. 


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>