MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rajinikanthe92965fd-3391-4279-8836-b890216e6f5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rajinikanthe92965fd-3391-4279-8836-b890216e6f5d-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ఇటీవల కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుని మంచి జోష్ మీద కొనసాగుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2, కార్తీక్ సుబ్బరాజ్ ల పెట్టా సినిమాలు రెండూ కూడా మంచి సక్సెస్ సాధించి రజిని క్రేజ్ ని మరింతగా పెంచాయి. ఇక ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజినికాంత్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అన్నాత్తే. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గోపీచంద్ హీరోగా శంఖం, శౌర్యం, అలానే రవితేజ తో దరువు వంటి సినిమాలు తీసి టాలీవుడ్ ప్రేక్షకుల్లో దర్శకుడిగా తనకంటూ మంచి పేరు దక్కించుకున్superstar rajinikanth annatthe movie;annatthe release date fixed;ravi;gopichand;karthik;shiva;ajith kumar;ravi teja;shankar;diwali;american samoa;tollywood;cinema;rajani kanth;kollywood;festival;media;november;lord siva;hero;success;ajit pawar;joshసూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ .....!!సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ... పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ .....!!superstar rajinikanth annatthe movie;annatthe release date fixed;ravi;gopichand;karthik;shiva;ajith kumar;ravi teja;shankar;diwali;american samoa;tollywood;cinema;rajani kanth;kollywood;festival;media;november;lord siva;hero;success;ajit pawar;joshMon, 25 Jan 2021 23:10:43 GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ఇటీవల కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుని మంచి జోష్ మీద కొనసాగుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2, కార్తీక్ సుబ్బరాజ్ ల పెట్టా సినిమాలు రెండూ కూడా మంచి సక్సెస్ సాధించి రజిని క్రేజ్ ని మరింతగా పెంచాయి. ఇక ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజినికాంత్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అన్నాత్తే. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గోపీచంద్ హీరోగా శంఖం, శౌర్యం, అలానే రవితేజ తో దరువు వంటి సినిమాలు తీసి టాలీవుడ్ ప్రేక్షకుల్లో దర్శకుడిగా తనకంటూ మంచి పేరు దక్కించుకున్న శివ, ఆపై కోలీవుడ్ తల అజిత్ హీరోగా వేదాళం, వీరం, వివేగం, విశ్వాసం వంటి సూపర్ హిట్స్ తీసి అక్కడ కూడా సూపర్ గా పేరు దక్కించుకున్నారు.

దానితో ఆయనకు సూపర్ స్టార్ రజిని నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ చాలావరకు షూటింగ్ జరుపుకుంది. రైతుల జీవితాలకు సంబంధించి మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్నారని, తప్పకుండా ఈ మూవీ రిలీజ్ తరువాత సూపర్ సక్సెస్ సాధించి సూపర్ స్టార్ ఖాతాలో మరొక హిట్ గా నిలవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన ని విడుదల చేసింది. ప్రస్తుతం అనారోగ్య కారణాల వలన కొన్నాళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ కి హీరో రజిని విరామం ప్రకటించి అమెరికా పయనమయి వెళ్లారని, ఆయన తిరిగివచ్చిన వెంటనే మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లో సినిమాని అనుకున్న డేట్ ప్రకారం రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఇక తమ అభిమాన సూపర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో రజిని ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది.....!!


'క్రాక్' మూవీ ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన 'ఆహా' ....??

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>