PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asha-activist-dies-after-ap-vaccine-malfunctiona141355a-63ab-4893-9eef-5bdac43c48dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asha-activist-dies-after-ap-vaccine-malfunctiona141355a-63ab-4893-9eef-5bdac43c48dd-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకా పంపిణీ కొనసాగుతుండగానే పలు చోట్ల ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్న చనిపోయిన ఘటనలు మనము చూస్తూ ఉన్నాము .. అయితే వారి మరణానికి కరోనా టీకా వల్ల కాదని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఏపీ లోని గుంటూరులో కూడా ఒక ఘటన చోటుచేసుకుంది .. కరోనా టీకా తీసుకున్నఇద్దరిలో ఓ ఆశా కార్యకర్త మరణించింది. ఇక వివరాలలోకి వెళ్తేcorona vaccine;lakshmi;vijayalakshmi;guntur;andhra pradesh;lakshmi devi;central government;tadepalli;coronavirusఏపీలో ఘోరం టీకా వికటించి మృతి చెందిన ఆశా కార్యకర్త..ఏపీలో ఘోరం టీకా వికటించి మృతి చెందిన ఆశా కార్యకర్త..corona vaccine;lakshmi;vijayalakshmi;guntur;andhra pradesh;lakshmi devi;central government;tadepalli;coronavirusSun, 24 Jan 2021 11:30:04 GMTకరోనా వైరస్ టీకా పంపిణీ కొనసాగుతుండగానే పలు చోట్ల ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్న చనిపోయిన ఘటనలు మనము చూస్తూ ఉన్నాము ..  అయితే వారి మరణానికి  కరోనా టీకా వల్ల కాదని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఏపీ లోని గుంటూరులో కూడా ఒక ఘటన చోటుచేసుకుంది .. కరోనా టీకా తీసుకున్నఇద్దరిలో ఓ ఆశా కార్యకర్త మరణించింది. ఇక వివరాలలోకి వెళ్తే. 

తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య కార్యకర్త ‌గా పనిచేస్తున్న లక్ష్మీ అదే ప్రాంతం లో  ఆశ కార్యకర్త గా పని చేస్తున్న విజయలక్ష్మీ ఈ నెల 20న కరోనా టీకా ‌ వేసుకున్నారు .. అయితే టీకా వేసుకున్న తర్వాత లక్ష్మీకి  తలనొప్పి, ఫిట్స్‌ వంటి లక్షణాలు  రాగా ,  విజయలక్ష్మి కి  తలనొప్పి,  వాంతులు వంటి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది    . దీంతో వీరిద్దరూ  చికిత్స నిమిత్తం  శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. అయితే  చికిత్స తర్వాత లక్ష్మి సాధారణ స్థితికి చేరుకున్నారని  ప్రస్తుతం ఆమె డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని జీజీహెచ్ వైద్యులు తెలిపారు.

మరోవైపు, కరోనా టీకా వికటించి ఆశ కార్యకర్త విజయలక్ష్మీ మాత్రం బ్రెయిన్‌ డెడ్ అయి ఈరోజు ఉదయం ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, విజయలక్ష్మీకి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా ఆయనకు ఎటువంటి ప్రభావం తలెత్తలేదు.. అయితే వారిద్దరి పరిస్థితిపై జిల్లాకు చెందిన అధికారులు అడిగి తెలుసుకున్నారు

ఇక నిన్న గుంటూరు జిల్లాలో 493 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు  సోమవారం నుంచి జిల్లాలో టీకా పంపిణీ కేంద్రాలను పెంచేందుకు అధికారులు  నిర్ణయించారు. అలాగే కొ-విన్‌ యాప్‌లో ఇప్పటికే  నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందికి త్వరగా వ్యాక్సిన్ వేసేలా   అధికారులు అన్ని  ఏర్పాట్లు చేస్తున్నారు ..





ప్చ్.. సాయి ధరమ్ తేజ్ మళ్లీ సోలోగానే పోరాడాలా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?

జగనోరు.. బాబోరు... అక్కడ షాక్ ?

ఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!

సుభాషిణి, శ్రీదేవి కి మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>