PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-ruling09c55d23-9aa9-4953-97bf-9680581f63ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-ruling09c55d23-9aa9-4953-97bf-9680581f63ef-415x250-IndiaHerald.jpgతనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో, రాజకీయ అనుభవం తక్కువ అయినా సరే, సంకల్ప బలంతో ముందుకు నడిచారు ఏపీ సీఎం జగన్. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు కొత్త పథకాలను అందించారు. ap cm jagan ruling;ganga;dr rajasekhar;nithya new;tara;ganges;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;local language;reddy"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?ap cm jagan ruling;ganga;dr rajasekhar;nithya new;tara;ganges;jagan;amaravati;andhra pradesh;y. s. rajasekhara reddy;local language;reddySun, 24 Jan 2021 15:07:15 GMTరాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తాను... రాష్ట్రంలో అసలు ఆకలి కేకలే వినపడకుండా చేస్తాను... అక్క చెల్లెళ్ళకు అండగా నిలుస్తాను... రైతన్నలకు భరోసా కల్పించి బ్రతుకు పంటలు పండిస్తాను అంటూ హామీల మీద హామీలు ఇచ్చి, భారీ ప్రసంగాలు ఇచ్చి ప్రజల మనసును గెలుచుకుని ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీఎం కుర్చీని కట్టబెట్టారు.

 తనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో, రాజకీయ అనుభవం తక్కువ అయినా సరే, సంకల్ప బలంతో ముందుకు నడిచారు ఏపీ సీఎం జగన్. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు కొత్త పథకాలను అందించారు. అయినా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యత గల ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ఫెయిలయ్యారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అవి ఏంటి ఎందుకు ఇప్పుడు చూద్దాం...!

పథకాలు పెంచారు కానీ.... అభివృద్ధి కనిపించడం లేదు. నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం అంతగా  లేదు, పరిశ్రమల సంఖ్య పెంచితే, ప్రజలకు పథకాలతో పని ఉండదు. మనం ఇస్తే చేయిచాచి తీసుకునే స్థాయిలో ప్రజలు ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలకు, వ్యాపారాలకు శ్రీకారం చుట్టి సహకారం అందిస్తే ప్రజలు స్వయం ఉపాధి పొందుతారు. తద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. ఇసుక సంక్షోభంతో కార్మికుల పొట్ట కొట్టారంటూ... పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ విధంగా ఇది పేద ప్రజలకు అన్యాయమే అంటున్నారు.

అన్నా క్యాంటీన్ లను మూసి వేయడంతో... వాటిపై ఆధారపడి బ్రతికే ఎంతో మంది పేదల నోటి కాడ కూడు లాగేసా అంటున్నారు. కనీసం అందుకు బదులుగా మరేదైనా దారి చూపారా అంటే అదీ లేదు. వైయస్ జగన్ అధికారంలోకి  రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి అంటున్నారు. రాజకీయ కక్షలతో రాష్ట్రం నిత్యం రణ రంగంగా మారింది... అధికారుల పై కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి అంటూ విమర్శిస్తున్నారు కొందరు రాజకీయ నేతలు.

 వికేంద్రీకరణ పేరుతో అమరావతి ప్రజలకు తీరని అన్యాయం చేశారు జగన్ అంటున్నారు. నేను ఉన్నాను నేను విన్నాను అన్న జగన్ ప్రజలకు అందించాల్సిన అసలైన అభివృద్ధి ఇది కాదు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.. మరి కొందరు... జగనన్న పారదర్శక పాలనను, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేని వారు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అయితే ప్రజలు ఎంతవరకు జగన్ ని విశ్వసించారో లేదా విమర్శింస్తున్నారో తెలియాలంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల ద్వారా తెలియనుంది.


అరుదైన రికార్డు సొంతం చేసుకున్నసుడిగాలి సుదీర్ అది ఏంటో తెలుసా ?

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>