Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amit-shah-speech-in-assam-in-election-campaign958ec16d-3d8f-4a65-958c-37e8be5917f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amit-shah-speech-in-assam-in-election-campaign958ec16d-3d8f-4a65-958c-37e8be5917f3-415x250-IndiaHerald.jpgఅస్సాంలో మరికొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆదివారం అస్సాంలోని కోక్రజార్‌, నలబరిలలో జరిగిన సభల్లో ప్రసంగించారు. అస్సాంను వరదలు, హింస, చొరబాట్లు లేని రాష్ట్రంగా తాము తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. తమను గెలిపిస్తే ప్రతి ఒక్క హామీ కచ్చితంగా..amit shah;amit shah;tiru;assam;bharatiya janata party;narendra modi;amith shah;congress;january;prime minister;minister;wife;contract;local language;central government;party;narendraఆ మూడింటి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్న అమిత్ షాఆ మూడింటి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్న అమిత్ షాamit shah;amit shah;tiru;assam;bharatiya janata party;narendra modi;amith shah;congress;january;prime minister;minister;wife;contract;local language;central government;party;narendraSun, 24 Jan 2021 23:17:28 GMTకేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆదివారం అస్సాంలోని కోక్రజార్‌, నలబరిలలో జరిగిన సభల్లో ప్రసంగించారు. అస్సాంను వరదలు, హింస, చొరబాట్లు లేని రాష్ట్రంగా తాము తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. తమను గెలిపిస్తే ప్రతి ఒక్క హామీ కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తే చొరబాట్లు పెరుగుతాయని, రాష్ట్రం దుర్భర పరిస్థితులకు నిలయంగా మారుతుందని అమిత్ షా హెచ్చరించారు. తమకు ఓటు వేస్తే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని, అప్పుడే రాష్ట్రంలో సంకేమాన్ని ముందుకు టీజేఏసీ తీసుకురాగలమని అమిత్ షా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని సహజసిద్ధ స్థానిక జాతి ప్రజల రాజకీయ, సాంస్కృతిక సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని అమిత్ షా అన్నారు. బోడోలాండ్ ఒప్పందానికి ఓ ఏడాది పూర్తయిందని చెప్తూ, గత డిసెంబరులో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతం ఇక సౌభాగ్యవంతంగా అభివృద్ధి చెందుతుందని, అందులో సందేహం లేదని అన్నారు.

బోడో ప్రాంతంలో రోడ్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇకపై బోడోలాండ్ అభివృద్ధి పథంలో నడవడం ప్రారంభమవుతుందని. బీటీఆర్ ఒప్పందం కుదిరినపుడు ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ, తిరుగుబాట్లపై చర్చించి, పరిష్కరించాలని, అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని నేడు మొదటిసారి బోడోలు, బోడోయేతరులు కలిసికట్టుగా ఉండటాన్ని చూస్తున్నామన్నారు. వీరిని విడదీసినవారికి ఇదే సరైన సమాధానమని చెప్పారు.

 అంతేకాకుండా చొరబాట్లను ఆపే సత్తా బీజేపీకే ఉందని, కోక్రజార్ తర్వాత నలబరిలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, చొరబాట్లు లేని అస్సాంగా చేయగలిగిన సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తుండటం వంటివాటిని ఉదాహరణగా చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే కేరళలో ముస్లిం లీగ్‌తోనూ, అస్సాంలో మౌలానా బద్రుద్దీన్ అజ్మల్‌ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌తోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే బోడోలాండ్ ఒప్పందంపై గత ఏడాది జనవరి 27న సంతకాలు జరిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌కు చెందిన నాలుగు గ్రూపులు, అప్పటి బీటీసీ చీఫ్ హగ్రమ మొహిలరీ సంతకాలు చేశారు. 


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>