PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderf9cd246c-ee2d-4318-92a2-bd213d7c6f06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderf9cd246c-ee2d-4318-92a2-bd213d7c6f06-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో కష్టపడడానికి ఇష్టపడని చాల మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక చాల మంది దొంగలుగా మారారు. అంతే కాదు.. పోలీసులకు షాక్ ఇచ్చేలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు ఎంతటి దారుణాలకైనా వెనుకాడటంలేదు. murder;women;orissa;odisha;police;panchayati;husband;wife;woman;thief;local languageభర్త ఊరెళ్లి వచ్చేసరికి రక్తపుమడుగులో భార్య.. అసలు ఏం జరిగిందంటే..!?భర్త ఊరెళ్లి వచ్చేసరికి రక్తపుమడుగులో భార్య.. అసలు ఏం జరిగిందంటే..!?murder;women;orissa;odisha;police;panchayati;husband;wife;woman;thief;local languageSun, 24 Jan 2021 21:00:00 GMT మహిళ మెడలోని బంగారు ఆభరణాల కోసం గొంతుకోసి హతమార్చారు. ఈ విషాద ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభికొట పంచాయతీ పరిధిలోని హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్‌ హులుకా భార్య కొసాయి హులుకా(29)ను జీవనం సాగిస్తున్నారు.ఇక  బిజయ్‌ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు. అయితే బిజయ్‌ హులుకా లేని సమయంలో కొంత మంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మహిళ గొంతి కోసి ఆమె మెడలోని నగలతో ఉడాయించారు. ఇక ఆమె భర్త పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో తన భార్యపడి ఉండటం గమనించారు. బిజయ్ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే హులుకా మృతి చెందింది. దీంతో కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో.. మృతురాలి గొంతు కోసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దుండగులు అపహారించకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉండటంతో చోరి కోసమే హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>