PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పోలీసులు విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్న విధానంపై ఇప్పుడు పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటంతో పోలీసులు విపక్ష నేతల మీద నమోదు చేసిన కేసులు కూడా ఇప్పుడు విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ నివాసం ముట్టడికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడు ఈ విభాగంపై పెట్టిన కేసులు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. dgp;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;media;chief minister;local language;ycp;partyఏపీ పోలీసులు మరీ ఇలానా...? ఈ కేసు ఏంటి...?ఏపీ పోలీసులు మరీ ఇలానా...? ఈ కేసు ఏంటి...?dgp;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;media;chief minister;local language;ycp;partySun, 24 Jan 2021 10:07:03 GMTఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పోలీసులు విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్న విధానంపై ఇప్పుడు పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటంతో పోలీసులు విపక్ష నేతల మీద నమోదు చేసిన కేసులు కూడా ఇప్పుడు విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ నివాసం ముట్టడికి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. అయితే ఇప్పుడు ఈ విభాగంపై పెట్టిన కేసులు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

అత్యాచార యత్నం కేసు పెట్టడంతో జడ్జి కూడా విస్మయం వ్యక్తం చేశారు. సీఎం నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు పై ఈ విధంగా కేసులు పెట్టడం ఏంటి అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో విమర్శలకు దారి తీసింది. జాతీయ మీడియా కూడా ఈ కేసుపై ఆశ్చర్యంగా చూసింది. స్థానిక మీడియా కూడా ఇదే అంశాన్ని పదేపదే హైలెట్ చేస్తూ వస్తున్నది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు కూడా పోలీసుల తీరును చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైసిపి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉంది అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలీసుల విషయంలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు విపక్షాలు చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి ఆలోచన లేని కేసుల కారణంగా పోలీసులు చులకన అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈ కేసుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో పోలీసుల మీద ప్రజల్లో నమ్మకం పోతుందని అంటున్నారు. పోలీసులు పెట్టే కేసుల మీద కూడా ప్రజల్లో నమ్మకం ఉండదు అని అంటున్నారు. ప్రజలు కూడా పోలీసులను లెక్కచేసే అవకాశం ఉండదు. భవిష్యత్తులో అయినా సరే అయితే పోలీసులు జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.


సుభాషిణి, శ్రీదేవి కి మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

హీరోయిన్స్ కెరియర్ పై సునీత కామెంట్స్ వెనుక ఆంతర్యం ?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>