MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha--twit-becomes-hot-topicbc176bdc-7d2f-4593-b651-8ea0095f6a48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha--twit-becomes-hot-topicbc176bdc-7d2f-4593-b651-8ea0095f6a48-415x250-IndiaHerald.jpgసెలెబ్రెటీలు తమ అభిమానులను పలకరించడానికి అదేవిధంగా తమ అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి సోషల్ మీడియాని ఒక పదునైన అస్త్రంగా వాడుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితులలో అక్కినేని వారి కోడలు సమంత అత్యుత్సాహంతో చేసిన ఒక ట్విట్ అనుకోకుండా వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. అయితే ఈ ట్రోలింగ్ కు భయపడ్డ సమంత ఆ ట్విట్ ను కొన్ని గంటల తరువాత తsamantha;naga chaitanya;nagarjuna akkineni;nageshwara rao akkineni;nithya new;samantha;cinema;media;love;fashionగందరగోళాన్ని సృష్టించిన సమంత వ్యవహారం !గందరగోళాన్ని సృష్టించిన సమంత వ్యవహారం !samantha;naga chaitanya;nagarjuna akkineni;nageshwara rao akkineni;nithya new;samantha;cinema;media;love;fashionSun, 24 Jan 2021 08:00:00 GMTసినిమా సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి సోషల్ మీడియాని ఒక పదునైన అస్త్రంగా వాడుకుంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో అక్కినేని వారి కోడలు సమంత అత్యుత్సాహంతో చేసిన ఒక ట్విట్ అనుకోకుండా వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. అయితే ఈ ట్రోలింగ్ కు భయపడ్డ సమంత ఆ ట్విట్ ను కొన్ని గంటల తరువాత తొలిగించవలసి రావడం సోషల్ మీడియా స్టామినాను మరొకసారి రుజువు చేసింది.


సమంత నిత్యం తన అభిమానులతో టచ్‌ లో ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా విషయాలను షేర్ చేస్తూ తెగ సందడి చేయడం ఆమె అలవాటు. ఇలాంటి సందర్భంలో ఆమె లేటెస్ట్ గా తన ఇన్‌ స్టా గ్రామ్‌ స్టోరీస్‌ లో ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. నాలుగేళ్లుగా అతడు సమంతకు ఫ్యాషన్ స్టైలిష్టుగా పని చేస్తున్నాడు. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫొటోను షేర్ చేసిన సమంత ‘ఐ లవ్ ‌యూ' అని కూడా క్యాప్షన్ పెట్టడంతో ఆ పోస్ట్ కొద్ది క్షణాలలో వైరల్ గా మారిపోయింది.


ఈ ఫొటోను చూసి నాగార్జున నాగచైతన్య అభిమానులు కూడ షాక్ అయ్యారు. కొందరు నెటిజన్లు అయితే ఆ ఫోటోకు స్క్రీన్ షాట్స్ తీసుకొని విపరీతంగా ట్రోల్ చేసారు. అంతేకాదు సమంత ఆ వ్యక్తికి ఎంత క్లోజ్‌ అయితే మాత్రం అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిని ‘ఐ లవ్ యూ’ అనడమేంటి అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈవిషయాలు సమంత దృష్టికి రావడంతో జరిగిన పొరపాటును గ్రహించిన సమంత ఆ ఫోటోను డిలీట్ చేసినా ఆమె పై  ట్రోలింగ్ కొనసాగుతూనే ఉండటం చూసిన వారికి సోషల్ మీడియా విషయంలో సెలెబ్రెటీ అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది..




జై శ్రీరామ్ నినాదాలు.. మమతా బెనర్జీ కి చేదు అనుభవం.?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?

కొడాలితో డ్యామేజ్ అక్కడే...కానీ గుడివాడలో...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>