MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mokshaca7a3412-02a7-4ea7-8545-d42167f44033-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mokshaca7a3412-02a7-4ea7-8545-d42167f44033-415x250-IndiaHerald.jpgనందమూరి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏకైక విషయం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న లెజెండ్ సినిమా షూటింగ్ అప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ విషయం మీద బాలకృష్ణ కూడా రెండు మూడు సార్లు త్వరలోనే మా వాడు లైన్లోకి వస్తాడు అని చెప్పడంతో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను పూరి జగన్నాథ్ లాంచ్ చేస్తాడనే వార్త రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరkalyan ram;balakrishna;boyapati srinu;nandamuri mokshagna teja;puri jagannadh;vijay;vijay deverakonda;india;cinema;hero;success;joseph vijay;nandamuri taraka rama rao;legend;devarakonda'లైగర్' దయ, మోక్షజ్ఞ ప్రాప్తం !'లైగర్' దయ, మోక్షజ్ఞ ప్రాప్తం !kalyan ram;balakrishna;boyapati srinu;nandamuri mokshagna teja;puri jagannadh;vijay;vijay deverakonda;india;cinema;hero;success;joseph vijay;nandamuri taraka rama rao;legend;devarakondaSun, 24 Jan 2021 08:00:00 GMTనందమూరి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏకైక విషయం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న లెజెండ్ సినిమా షూటింగ్ అప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ విషయం మీద బాలకృష్ణ కూడా రెండు మూడు సార్లు త్వరలోనే మా వాడు లైన్లోకి వస్తాడు అని చెప్పడంతో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.


అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను పూరి జగన్నాథ్ లాంచ్ చేస్తాడనే వార్త రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే ఒక ఫైటింగ్ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మోక్షజ్ఞతో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని అంటున్నారు. లైగర్ సినిమా సక్సెస్ అయితేనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం పూరి జగన్నాథ్ కు దక్కుతుందని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ఒక సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడట పూరి జగన్నాథ్. లైగర్ సక్సెస్ అయితే కనుక ఆ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.



అయితే నిజానికి మోక్షజ్ఞ బాడీ చూస్తే ఆయన సినిమా హీరోగా లాంచ్ కావడానికి ఇంకా సిద్ధం కాలేదని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఆయన బాడీ బిల్డింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని త్వరలోనే బాడీ బాగా తగ్గించి హీరో లుక్ వచ్చే లాగా చేస్తారని అంటున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు బాలకృష్ణ కొడుకు తలుచుకుంటే బాడీ తగ్గించడం ఎంతసేపు చెప్పండి. అయితే ఈయనను లాంచ్ చేసేది పూరి జగన్నాధా లేక మరో దర్శకుడికి అవకాశం దొరుకుతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.




జై శ్రీరామ్ నినాదాలు.. మమతా బెనర్జీ కి చేదు అనుభవం.?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?

కొడాలితో డ్యామేజ్ అక్కడే...కానీ గుడివాడలో...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>