PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb02d3bc1-489a-4a99-8ea3-cc511b0f50cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb02d3bc1-489a-4a99-8ea3-cc511b0f50cb-415x250-IndiaHerald.jpgప్రగతిభవన్ లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం - కలం శాఖగా కాకుండా పొలం - హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని ఆయన సూచించారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్kcr;kcr;kumaar;kamalakar;prasanth;rajeev;gangula kamalakar;vemula prashanth reddy;telangana;mp;district;chief minister;vegetable market;central government;reddy;prashant kishor;mantraవ్యవసాయ చట్టాలు తెచ్చినా... కేసీఆర్ కీలక వ్యాఖ్యలువ్యవసాయ చట్టాలు తెచ్చినా... కేసీఆర్ కీలక వ్యాఖ్యలుkcr;kcr;kumaar;kamalakar;prasanth;rajeev;gangula kamalakar;vemula prashanth reddy;telangana;mp;district;chief minister;vegetable market;central government;reddy;prashant kishor;mantraSun, 24 Jan 2021 21:48:08 GMTజిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ కాగితం - కలం శాఖగా కాకుండా పొలం - హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని ఆయన సూచించారు. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన.

రైతులు పండించిన పంటలను మార్కెట్ లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పదిరోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసారు.

ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలనీ, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సూచనలు చేసారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి వివరించారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>