MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tandavac57bc19-d2e5-408f-85cc-a4c2da088ad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tandavac57bc19-d2e5-408f-85cc-a4c2da088ad7-415x250-IndiaHerald.jpgఅమెజాన్ ప్రైమ్ లో విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ కి సంబంధించిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ వెబ్ సిరీస్ లో హిందూ దేవతలు దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను గాయపరిచారని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా అనేక సంఘాలు, పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వచ్చి పడటంతో తాండవ్ యూనిట్ ముందస్తుగానే జాగ్రత్త పడి క్షమాపణలు చెప్పింది. అంతే కాక వివాదాస్పదమైన సీన్లు తొలగిస్తున్నామని కూడా ఒక ప్రకటన చేసింది. అయినా హిందూ సంఘాలు ఇంకా చల్లారలేదు. తాజాగా ఈ వివాthandav;koti;ajay;deva;amazon;writer;army;police station;prize;traffic police;gift;hindus;raccha‘తాండవ్’ రచ్చ : నాలుక కోస్తే కోటి బహుమతి!‘తాండవ్’ రచ్చ : నాలుక కోస్తే కోటి బహుమతి!thandav;koti;ajay;deva;amazon;writer;army;police station;prize;traffic police;gift;hindus;racchaSun, 24 Jan 2021 17:00:00 GMTఅమెజాన్ ప్రైమ్ లో విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ కి సంబంధించిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ వెబ్ సిరీస్ లో హిందూ దేవతలు దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను గాయపరిచారని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా అనేక సంఘాలు, పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వచ్చి పడటంతో తాండవ్ యూనిట్ ముందస్తుగానే జాగ్రత్త పడి క్షమాపణలు చెప్పింది. అంతే కాక వివాదాస్పదమైన సీన్లు తొలగిస్తున్నామని కూడా ఒక ప్రకటన చేసింది. అయినా హిందూ సంఘాలు ఇంకా చల్లారలేదు. 


తాజాగా ఈ వివాదానికి సంబంధించి మహారాష్ట్రలో అతిపెద్ద హిందూ సంఘమైన కర్ణిసేన స్పందించింది. ఈ తాండవ్ వెబ్ సిరీస్ ను వ్యతిరేకించిన కర్ణి సేన చీఫ్ అజయ్ సెంగర్ ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ వెబ్ సిరీస్ లో హిందూ దేవుళ్ళు హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి నాలుక కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు.


ఈ తాండవ్ దర్శక నిర్మాతలు ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్పినప్పటికీ అది సరిపోదని క్షమాపణ తాము అంగీకరించబోమని అజయ్ తేల్చిచెప్పారు. ఇక ఈ తాండవ్ వెబ్ సిరీస్ ని నిర్మించిన వారి మీద, నటించిన వారి మీద, దర్శకుడు, రచయిత మొదలైన అందరి మీద దేశంలో చాలా చోట్ల పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ వివాదం ఎందుకని భావించిన మేకర్స్ అందులో వివాదాస్పదమైన సీన్లను కట్ చేస్తామని చెప్పినా హిందూ సంఘాలు చల్లారక పోవడం గమనార్హం.


సమంత సినిమా కోసం భారీ ప్లాన్..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>