MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabha9802f225-35b8-408a-9749-787f4cd00e8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabha9802f225-35b8-408a-9749-787f4cd00e8b-415x250-IndiaHerald.jpgగతంలో హీరోయిన్లకు ఇపుడు హీరోయిన్లకు అతి పెద్ద తేడా ఏంటి అంటే చెప్పుకోవడానికి చాలానే ఉంది. నాడు హీరోయిన్లు వెండి తెర మీద పండు వెన్నెలకు కురిపించారు. ప్రత్యేకించి వారి కోసమే చాలా సినిమాలు వచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో పాత హీరోయిన్లు నటించారు. అంతే కాదు, సినిమా మొత్తానికి, కధకు కూడా వారు సెంటర్ అట్రాక్షన్ గా ఉన్నారు nabha;nabha natesh;shankar;sudigali sudheer;christmas;tollywood;cinema;ismart shankar;silver;heroine;silver screen;nijam;solo bathuke so betterగ్లామరే కాదు గ్రామరూ ఉందంటున్న ఇస్మార్ట్ గర్ల్ ?గ్లామరే కాదు గ్రామరూ ఉందంటున్న ఇస్మార్ట్ గర్ల్ ?nabha;nabha natesh;shankar;sudigali sudheer;christmas;tollywood;cinema;ismart shankar;silver;heroine;silver screen;nijam;solo bathuke so betterSun, 24 Jan 2021 20:30:00 GMTవెండి తెర మీద పండు వెన్నెలకు కురిపించారు. ప్రత్యేకించి వారి కోసమే చాలా సినిమాలు వచ్చాయి.

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో పాత హీరోయిన్లు  నటించారు. అంతే కాదు, సినిమా మొత్తానికి, కధకు కూడా  వారు సెంటర్ అట్రాక్షన్ గా ఉన్నారు. కానీ ఇపుడు చూస్తే హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ డాల్ మాత్రమే అన్నది ప్రూవ్ చేస్తున్నారు. నాలుగు పాటలకు మాత్రమే హీరోయిన్ ని పరిమితం చేస్తున్నారు. మంచి పాత్రలు చేద్దామని వచ్చిన వారు కూడా దీంతో డిసప్పాయింట్ అవుతున్నారు.

దీని మీద ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ మాట్లాడుతూ కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే తాను పోషించదలచుకోలేదు అంటున్నారు. తనలో మంచి టాలెంట్ ఉంది. దానికి తగిన పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను తాను ఏంటో రుజువు చేసుకుంటాను అని కూడా అంటోంది. గత ఏడాది చివరలో క్రిస్మస్ వేళ వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నభా పోషించిన క్యారక్టర్ చూసిన వారికి అది నిజమే అనిపిస్తుంది.

ఈ మూవీలో నభా వేసిన పాత్ర నిజంగా బాగుంటుంది. ఆమెలోని కొత్త  షేడ్స్ ని జనానికి పరిచయం చేస్తుంది. ఆ తరువాతనే టాలీవుడ్ కి కూడా నభాను ఏ రకమైన రోల్స్ అయినా ఇవ్వవచ్చు అన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందట. అదిగో అన్న సినిమా నభా నటేష్ మొదటి చిత్రం అంటే ఎవరికీ గుర్తుండదు, కానీ నన్ను దోచుకుందువటే మూవీ మాత్రం అందరికీ బాగా తెలుసు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీతో నభా జాతకం మారింది.

ఆ తరువాత చూస్తే ఇస్మార్ట్ శంకర్ మొవీ ఏకంగా నభాను ఎక్కడితో తీసుకెళ్ళిపోయింది. అయితే తాను అన్ని రకాల క్యారక్టర్లూ చేస్తాను అంటోంది ఈ ముద్దు గుమ్మ. మొత్తానికి నభా నటేష్ లోని గ్లామర్ నే ఇంతదాకా చూశారు. ఆమె చెప్పే గ్రామ‌ర్ కూడా వినాలి, చూడాలి అంటే, టాలెంట్ ని పెంచే రోల్స్ రావాల్సిందే.




సుప్రీంకోర్టులో మారిన ధర్మాసనం.. పంచాయతీ ఎన్నికలపై పెరిగిన ఉత్కంఠ

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>