PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cd0c8ee-cfad-4fb6-a98e-408060854b85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cd0c8ee-cfad-4fb6-a98e-408060854b85-415x250-IndiaHerald.jpgవైఎస్‌ షర్మిల... ఏపీ సీఎం జగన్‌ తోబుట్టువు.. వైఎస్సార్‌కు వీరిద్దరే సంతానం.. ఈ అన్నాచెల్లెళ్ల బంధం కూడా అపురూపంగా ఉంటుంది. అన్న కష్టంలో ఎప్పుడూ తోడుంటుంది షర్మిల... గతంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంది.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేసి ఒక విధంగా పార్టీని బతికించింది. అయితే ఇప్పుడు ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య ఏమాత్రం పొసగడం లేదట. అంతే కాదు.. విభేదాలు తీవ్రం అయ్యాయట. ఏకంగా జగన్‌కే షర్మిల రాజకీయంగా జలక్ ఇవ్వొచ్చంటూ ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం రాసుకjagan;vijayalakshmi;jagan;andhra pradesh;telangana;dr. rajasekhar;cm;february;kathanam;vemuri radhakrishna;sara shrawan;panga;party;andhra jyothiజగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?jagan;vijayalakshmi;jagan;andhra pradesh;telangana;dr. rajasekhar;cm;february;kathanam;vemuri radhakrishna;sara shrawan;panga;party;andhra jyothiSun, 24 Jan 2021 09:01:11 GMTఏపీ సీఎం జగన్‌ తోబుట్టువు.. వైఎస్సార్‌కు వీరిద్దరే సంతానం.. ఈ అన్నాచెల్లెళ్ల బంధం కూడా అపురూపంగా ఉంటుంది. అన్న కష్టంలో ఎప్పుడూ తోడుంటుంది షర్మిల... గతంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంది.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేసి ఒక విధంగా పార్టీని బతికించింది. అయితే ఇప్పుడు ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య ఏమాత్రం పొసగడం లేదట. అంతే కాదు.. విభేదాలు తీవ్రం అయ్యాయట. ఏకంగా జగన్‌కే షర్మిల రాజకీయంగా జలక్ ఇవ్వొచ్చంటూ  ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం రాసుకొచ్చింది.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో ఈ విషయం బయటపెట్టారు. ఆయన ఏపీ సీఎంకు యాంటీ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అంత ధైర్యంగా రాశారంటే అందులో విషయం ఉండకుండా పోదు. అందులోనూ రాజకీయాల విషయంలో కాస్త అటూ ఇటూగా రాయొచ్చేమో కానీ.. జగన్ ఫ్యామిలీ మ్యాటర్‌ను కూడా గట్టిగా రాశాడంటే.. విషయం ఏదీ తీవ్రంగా ఉన్నట్టే లెక్క..

ఆంధ్రజ్యోతి కథనంలో సారాంశం ఏంటంటే.. జగన్‌ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట.

ఫిబ్రవరి మొదటి పక్షంలో, బహుశా ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా విలేకరుల సమావేశంలో ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారట. అంతే కాదు..  ఈ విలేకరుల సమావేశంలో శ్రీమతి విజయలక్ష్మి కూడా పాల్గొంటారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారట. ‘తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌’ అని తాను ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీకి నామకరణం కూడా షర్మిల చేసుకున్నారట.


సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

హీరోయిన్స్ కెరియర్ పై సునీత కామెంట్స్ వెనుక ఆంతర్యం ?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>