PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/lv-subramanyamf95f10b8-a5a1-4cfc-be6c-50dfdc3eaed6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/lv-subramanyamf95f10b8-a5a1-4cfc-be6c-50dfdc3eaed6-415x250-IndiaHerald.jpgఅయోధ్యలోని రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం శనివారం తెనాలి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తితో త్యాగాలకు సిద్ధపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. అలాంటి అధికారులను అందరూ గుర్తుంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం లేకపోవచ్చని ఎల్వీ అభిప్రాయపడ్డారు.lv subramanyam;rakshita;andhra pradesh;television;panchayati;local language;tenali;nirbayaఏపీ స్థానిక ఎన్నికలపై మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు...ఏపీ స్థానిక ఎన్నికలపై మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు...lv subramanyam;rakshita;andhra pradesh;television;panchayati;local language;tenali;nirbayaSun, 24 Jan 2021 22:40:00 GMTటెలివిజన్ సీరియల్ మంచి రసకందాయంగా సాగుతున్నట్లుగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక (పంచాయతీ) సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కథా కమామీషు నడుస్తుంది. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్రంలోని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలే కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మల్లగుల్లాలు పడుతుంది. ఇక ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటూ ఉండడమే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపేలా ఉద్యోగ సంఘాల నేతలు కూడా కరోనా టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చేస్తున్న ప్రకటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.







అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం శనివారం తెనాలి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తితో త్యాగాలకు సిద్ధపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. అలాంటి అధికారులను అందరూ గుర్తుంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం లేకపోవచ్చని ఎల్వీ అభిప్రాయపడ్డారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు.. మనం రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో తమ రక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలను నిర్భయంగా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అడిగి పొందాలని ఆయన సూచించారు. కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనడం తమ ప్రాణాలకు సంబంధించిన అంశమని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, మాకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని అంటున్నారు. టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెప్పటం వల్ల వారిని వదిలేసి విధుల్లో పాల్గొనదలచిన మిగిలిన ఉద్యోగులతో ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చని వ్యాఖ్యానించారు.




ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>