ViralMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/work-from-cycled9d0069e-5ac1-4893-b9a6-39f94ddf8c5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/work-from-cycled9d0069e-5ac1-4893-b9a6-39f94ddf8c5f-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చాక వర్క్ ఫ్రం హోమ్ సాధారణమై పోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు అన్ని సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచే విడులని నిర్వర్తిస్తున్నారు .. అయితే మహారాష్ట్రకు చెందిన ముగ్గురు టెక్కీలు తమ "వర్క్ ఫ్రం హోమ్" ను "వర్క్ ఫ్రం సైకిల్" గా మార్చుకున్నారు.work from cycle;mumbai;maharashtra - mumbai;interview;maharashtra;cycle;letter;houseసైకిల్ పై 1600 కిలోమీటర్లు ప్రయాణం . రోడ్డు మధ్యలో ఈ యువకులు చేసిన పనేంటో తెలుసాసైకిల్ పై 1600 కిలోమీటర్లు ప్రయాణం . రోడ్డు మధ్యలో ఈ యువకులు చేసిన పనేంటో తెలుసాwork from cycle;mumbai;maharashtra - mumbai;interview;maharashtra;cycle;letter;houseSun, 24 Jan 2021 16:52:00 GMTహోమ్  సాధారణమై పోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు  అన్ని సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచే విడులని నిర్వర్తిస్తున్నారు ..  అయితే  మహారాష్ట్రకు చెందిన ముగ్గురు టెక్కీలు తమ "వర్క్ ఫ్రం హోమ్" ను "వర్క్ ఫ్రం సైకిల్" గా మార్చుకున్నారు.

మహారాష్ట్ర ముంబైకి చెందిన బెకన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతిశ్ భలేరావు వర్క్ ఫ్రం హోమ్లో  సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు .. వారు నెల రోజుల పాటు ఎలాంటి సెలవులు పెట్టకుండానే సైక్లింగ్ ట్రిప్ చేశారు. ముంబై నుంచి కన్యాకుమారి వరకు 1,687 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు ... మరి సైకిల్ పై ఆలా టూర్ కి వెళ్తే ఆఫీస్ వర్క్ ఎలా చేస్తారనే కదా మీ  ప్రశ్న! అయితే వీళ్ళు  వర్క్ ఎలా చేయాలో కూడా పక్క ప్రణాళిక వేసి సైకిల్ ట్రిప్ ని మొదలుపెట్టారు..ఎవరైనా సుదూర ప్రాతాలకి ప్రయాణం చేస్తుంటే మధ్యలో విరామాలు తీసుకుంటూ ఉంటారు .. అయితే వీళ్ళు కూడా ప్రయాణం మధ్యలో  హైవేల పక్కన ఢాబాలు, లాడ్జిల్లో ల్యాప్ టాప్ లు ఓపెన్ చేసి.. తమ పనిని చేసుకునేవారు.

అయితే ఒకేచోట కూర్చొని  ఆగిపోకుండా వర్క్ ఫ్రం హోమ్ను ప్రయాణంగా, ఆడ్వెంచర్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని ఆ ముగ్గురు స్నేహితులు చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోనే పనిచేసి నెగిటివ్ ఆలోచనలు, చిరాకు రాకుండా ఇలా వర్క్ ఫ్రం సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నామని, దానిని పూర్తి  చేసేశామని అన్నారు. తమ కష్టానికి తగ్గ  సంతోషాన్ని పొందామని వాళ్ళు అన్నారు .. గతేడాది నవంబర్లో మొదలైన వారి ప్రయాణం డిసెంబర్లో ముగిసింది.

రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 11 గంటల వరకు సైక్లింగ్ చేసి ఆ తర్వాత పని చేసుకునేవారు. ఇక సెలవుల సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కేవారు. చాలాసార్లు  విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. అడ్వెంచరస్ హాలీడే గా  మేము  చాలా బాగా ఎంజాయ్ చేశాం అని..  ఢాబాలనే మా వర్క్ స్టేషన్లుగా మార్చుకున్నామని . జార్జ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.




సమంత సినిమా కోసం భారీ ప్లాన్..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>