Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpg''మన గ్రామాలను అభివృధ్ధి చేసుకునే గొప్ప అవకాశం రాబోతోంది. ఏపీలో 18-35 ఏళ్ల వయసున్న వారు 68 లక్షల మంది ఉన్నారు. పంచాయతీ పాలనను సుపరిపాలనగా మార్చాలనుకుంటే యువత ముందుకు రావాలి. పంచాయతీ ప్రగతికి దిశానిర్దేశం చేసి, మంచి ఫలితాలు సాధించగలిగే శక్తి సామర్థ్యాలు ఏపీలోని యువతలో పుష్కలంగా ఉన్నాయి. యువత భవిష్యత్ నాయకులుగా రూపుదిద్దడం జనసేన ముఖ్య ఆశయాల్లో ఒకటి. pavan kalyan;pawan;kumaar;pawan kalyan;pragathi;india;andhra pradesh;janasena;2019;january;panchayati;king;february;janasena party;shakti;racchaయువతకు పవన్ పిలుపు.....మీ ఊరికి మీరే సర్పంచ్!!!యువతకు పవన్ పిలుపు.....మీ ఊరికి మీరే సర్పంచ్!!!pavan kalyan;pawan;kumaar;pawan kalyan;pragathi;india;andhra pradesh;janasena;2019;january;panchayati;king;february;janasena party;shakti;racchaSun, 24 Jan 2021 20:59:10 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..!!!ఏపీలో పంచాతీయ ఎన్నికల వేడి రాజుకుంది. తొలిదశ ఎన్నికలకు ఇప్పటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేపట్టింది. ఎన్నికల సంఘానికి అధికారులు, ఉద్యోగులెవరూ సహకరించడం లేదు. ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాటల మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పైరేపు సుప్రీంకోర్టు విచారించనుంది. పంచాయతీ ఎన్నికలపై ఇంత రచ్చ జరుగుతుంటే మరోవైపు విపక్షాలు మాత్రం ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. పంచాయతీ పోరుపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
గ్రామాలను అభివృద్ధి చేసుకునే అద్భుత అవకాశం రాబోతోందని.. యువత పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

''మన గ్రామాలను అభివృధ్ధి చేసుకునే గొప్ప అవకాశం రాబోతోంది. ఏపీలో 18-35 ఏళ్ల వయసున్న వారు 68 లక్షల మంది ఉన్నారు. పంచాయతీ పాలనను సుపరిపాలనగా మార్చాలనుకుంటే యువత ముందుకు రావాలి. పంచాయతీ ప్రగతికి దిశానిర్దేశం చేసి, మంచి ఫలితాలు సాధించగలిగే శక్తి సామర్థ్యాలు ఏపీలోని యువతలో పుష్కలంగా ఉన్నాయి. యువత భవిష్యత్ నాయకులుగా రూపుదిద్దడం జనసేన ముఖ్య ఆశయాల్లో ఒకటి. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి. మన గ్రామాలను, రాష్ట్రాలు, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న ఆలోచనలు ఉన్న యువతీ యువకులు పంచాయతీ ఎన్నిల్లో పాల్గొనాలి. వారికి జనసేన తరపున మద్దతు అందజేస్తాం.'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు నిమ్మగడ్డ.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.


బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>