MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr020cd3bc-f17c-4f51-a0fe-a018d9dfcb2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr020cd3bc-f17c-4f51-a0fe-a018d9dfcb2e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాల్లో దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం rrr;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;rrr movie;cinema;huzur nagar;hollywood;industry;vegetable market;film nagar;international;james bond;no time to die;master;james cameronఆర్ఆర్ఆర్ అప్‌డేట్: వాళ్ల కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్!ఆర్ఆర్ఆర్ అప్‌డేట్: వాళ్ల కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్!rrr;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;rrr movie;cinema;huzur nagar;hollywood;industry;vegetable market;film nagar;international;james bond;no time to die;master;james cameronSun, 24 Jan 2021 23:56:36 GMTరాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోస్తాయని, సినిమాలో అవి కూడా కీలక పాత్ర పోషిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదల గురించి వచ్చిన వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ సినిమా విడుదల చేయాలనుకునే సమయంలోనే జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ కూడా విడుదల అవుతుందని, దీని వల్ల ఈ సినిమా మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ చిన్న ఇంగ్లీషు పాట కూడా ఉంటుందట. ఈ పాట ఎన్‌టీఆర్‌ చేస్తున్న కొమరం భీం పాత్రపై ఆసక్తి చూపించే ఒలీవియా మొర్రిస్ కేరక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ వార్తలు వచ్చిన క్షణం నుంచి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకర్షిండమే జక్కన్న ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టేందుకే రాజమౌలి ఈ ప్లాన్ చేశాడట. అయితే ఇంత వైరల్ అవుతున్న ఈ వార్తపై సినిమా టీం నుంచి ఎటువంటి స్పందనా లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇది నిజమో కాదో కూడా తెలీదు.




ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>