PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/are-the-side-effects-real-corona-vaccined54f0164-5491-436c-9675-f0be2d2ee50e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/are-the-side-effects-real-corona-vaccined54f0164-5491-436c-9675-f0be2d2ee50e-415x250-IndiaHerald.jpgవ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెల 16న ప్రక్రియ ప్రారంభం అయింది. మన దేశంలో అత్యవసర వినియోగం కింద కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు.. అయితే ప్రధాని ప్రారంభించినా, వాక్సిన్ వేసుకునేందుకు మాత్రం హెల్త్ కేర్ వర్కర్లు ఆలోచిస్తున్నారు. వాక్సిన్ రాక ముందు ఎప్పుడా ఎప్పుడా అంటూ అంతా ఎదురు చూశారు. తీరా వచ్చేశాక... భయపడుతున్నారు. ఇదీ దేశంలో తాజా పరిస్థితి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దంటూ విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నా... ప్రజల్లో మాత్రం అనుమానాలు, భయాలు ఇంకా అలానే ఉన్నాయి. వ్యాక్సిన్‌ తీసare the side effects real corona vaccine;rakshita;prime minister;successసైడ్ ఎఫెక్ట్స్ నిజమేనా..?సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనా..?are the side effects real corona vaccine;rakshita;prime minister;successSun, 24 Jan 2021 21:00:00 GMTప్రధాని ప్రారంభించినా, వాక్సిన్ వేసుకునేందుకు మాత్రం హెల్త్ కేర్ వర్కర్లు ఆలోచిస్తున్నారు.

వాక్సిన్ రాక ముందు ఎప్పుడా ఎప్పుడా అంటూ అంతా ఎదురు చూశారు. తీరా వచ్చేశాక... భయపడుతున్నారు. ఇదీ దేశంలో తాజా పరిస్థితి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దంటూ విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నా... ప్రజల్లో మాత్రం అనుమానాలు, భయాలు ఇంకా అలానే ఉన్నాయి.  వ్యాక్సిన్‌ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తయారీ కంపెనీలు ముందే చెప్పాయి.  ప్రస్తుతం తీసుకుంటున్న వారిలో కొందరి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇదే వారి భయానికి కారణం అవుతోంది.

అంతేకాదు... దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ తీసుకున్నాక... పలువురు చనిపోయారు. అయితే వాళ్ళు ఏ కారణంతో చనిపోయారో తెలియకపోయినా... జనం మాత్రం టీకా ప్రభావమేనని వణుకుతున్నారు. తీసుకుంటే ఏమవుతుందోనన్న అలజడి చాలా మందిలో్ కనిపిస్తోంది.

వ్యాక్సిన్ వచ్చేదాకా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రజలకు.. టీకాలపై భిన్నవాదనలతో మతి పోతోంది. నిపుణులు కూడా టీకాల పనితీరుపై స్పష్టత ఇవ్వలేకపోవడం మరింత అయోమంలో పడేస్తోంది. 50 శాతం సక్సెస్ రేట్ ఉంటే చాలు... టీకాకు అనుమతివ్వచ్చన్న నిబంధనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

మరోవైపు చూస్తే వంద శాతం సురక్షితం కాదని తెలిసీ టీకాకు అనుమతిచ్చి ఉపయోగం ఏముందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అదే సమయంలో వ్యాక్సిన్ ఎన్నాళ్లు పనిచేస్తుందనే విషయంలో కూడా క్లారిటీ లేదనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.  సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉందని, ఆ బాధలు పడే బదులు కరోనాను ఫేస్ చేయడమే ఉత్తమమనే మానసిక స్థితిలో ప్రజలు ఉన్నారన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది.

వ్యాక్సిన్ల అభివృద్ధి, అనుమతులపై చెలరేగుతున్న గందరగోళంతో.. వ్యాక్సినేషన్ పై ఎన్నో సందేహాలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ కు ముందే టీకా తయారీ కంపెనీల మధ్య చెలరేగిన మాటల యుద్ధం కూడా దీనికి ఆజ్యం పోసినట్టయింది. 


బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>