PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jawahar3a429746-c4dc-46d3-876f-715702f01ae6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jawahar3a429746-c4dc-46d3-876f-715702f01ae6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నాయకులకు మాజీ మంత్రి కేఎస్ జవహర్ బహిరంగ లేఖ రాశారు. అనేవి ఉద్యోగుల అభ్యున్నతి కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్నవని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతిలో, రాష్టాభివృద్ది ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పని చేయాల్సిన ఉద్యోగ సంఘాలు ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం అత్యంత బాధాకరమని జవహర్ తెలిపారు. jawahar;tamannaah bhatia;andhra pradesh;mohandas karamchand gandhi;panchayati;minister;letter;tdp;lie;party;kothapalli samuel jawaharఎన్నికలను బహిష్కరించడం సరికాదు : ఉద్యోగ సంఘాలకు మాజీ మంత్రి జవహర్ లేఖఎన్నికలను బహిష్కరించడం సరికాదు : ఉద్యోగ సంఘాలకు మాజీ మంత్రి జవహర్ లేఖjawahar;tamannaah bhatia;andhra pradesh;mohandas karamchand gandhi;panchayati;minister;letter;tdp;lie;party;kothapalli samuel jawaharSun, 24 Jan 2021 19:52:59 GMTఆంధ్రప్రదేశ్ లో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నాయకులకు మాజీ మంత్రి కేఎస్ జవహర్ బహిరంగ లేఖ రాశారు. అనేవి ఉద్యోగుల అభ్యున్నతి కోసం, సమస్యల పరిష్కారం కోసం  ఏర్పాటు చేసుకున్నవని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతిలో, రాష్టాభివృద్ది ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పని చేయాల్సిన ఉద్యోగ సంఘాలు ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం అత్యంత బాధాకరమని జవహర్ తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలైన హైకోర్టు ఆదేశాలను, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను దిక్కరిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామనడం తీవ్ర అభ్యంతరకరమని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఉద్యోగులందరూ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినప్పుడు నోరెత్తని  ఉద్యోగ సంఘాల నేతలు కరోనా తగ్గుముఖం పట్టాక అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ రాజకీయ ప్రకటనలు చేయడం తమ స్వార్థ ప్రయోజనాల కోసమేనని టీడీపీ నేత అన్నారు.
                                                                               ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న  పీఆర్సీ, మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు  ఉద్యోగ సంఘాల నేతలు కృషి చేయకుండా రాజ్యాంగ సంస్థల ఆదేశాలు దిక్కరిస్తూ రాజ్యాంగ సంక్షోభం తలెత్తేలా వ్యవహరించడం సరికాదని టీడీపీ నేత జవహర్ తప్పుబట్టారు. గ్రామస్వరాజ్యం మహాత్మా గాంధీ సిద్దాంతం కాగా, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, పరిపాలనలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం అంబేద్కర్ సిద్దాంతమన్న విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తుంచుకోవాలని సూచించారు. గాంధీజీ ,అంబేద్కర్ సిద్దాంతాలకు ఆదర్శాలకు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకమా సమాధానం చెప్పాలి? అన్నారు. రాజ్యాంగం గొప్పదా, రాజ్యాంగం ప్రసాదించిన పదవులు గొప్పవా అంటే...రాజ్యాంగమే గొప్పదని చెబుతామన్నారు. హైకోర్టు తీర్పునకు అందరూ కట్టుబడి ఉండాలని, 151 అంతస్తుల భవనం కూడా రాజ్యంగం అనే పునాది మీద ఆధారపడి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టింది, అధికార పార్టీ ర్యాలీలు జరుగుతున్నాయి, ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని జవహర్ గుర్తుచేశారు. ఉద్యోగులు పనిచేస్తున్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు రాని కరోనా ఉద్యోగ సంఘాల నేతలకు ఎన్నికలు అంటే వచ్చిందా? అని జవహర్ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వార్థాన్ని వీడి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములై తమ ధర్మాన్ని నిర్వర్తించాలని టీడీపీ నేత జవహర్ పిలుపునిచ్చారు.
                       
                                                                                           


కోవిడ్ టీకా తీసుకున్న మరో హెల్త్ వర్కర్ మృతి

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>