PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dam808ef7a1-2f5b-4917-b101-031161eebd8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dam808ef7a1-2f5b-4917-b101-031161eebd8d-415x250-IndiaHerald.jpgభారతదేశంలో వివిధ నదులపై నిర్మించిన 1000కి పైగా డ్యామ్ లు మరో ఐదేళ్లలో 50 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని, ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని, ఇది ప్రపంచానికే పెను విపత్తు కావచ్చని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది. 20వ శాతబ్దంలో నిర్మించిన ఈ ఆనకట్టల కింద కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారని, ఎన్నో పట్టణాలు, గ్రామాలు ఉన్నాయని, వారందరి జీవితాలూ డ్యామ్ ల వల్ల ప్రమాదంలో పడనున్నాయని పేర్కొంది.dam;jeevitha rajaseskhar;kerala;india;japan;france;canada;zambia;zimbabwe;central governmentప్రమాదకర స్థాయికి ఇండియాలోని డ్యామ్ లుప్రమాదకర స్థాయికి ఇండియాలోని డ్యామ్ లుdam;jeevitha rajaseskhar;kerala;india;japan;france;canada;zambia;zimbabwe;central governmentSun, 24 Jan 2021 13:47:51 GMTభారతదేశంలో వివిధ నదులపై నిర్మించిన 1000కి పైగా డ్యామ్ లు మరో ఐదేళ్లలో 50 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని, ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని, ఇది ప్రపంచానికే పెను విపత్తు కావచ్చని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది. 20వ శాతబ్దంలో నిర్మించిన ఈ ఆనకట్టల కింద కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారని, ఎన్నో పట్టణాలు, గ్రామాలు ఉన్నాయని, వారందరి జీవితాలూ డ్యామ్ ల వల్ల ప్రమాదంలో పడనున్నాయని పేర్కొంది.
 
'ఏజింగ్ వాటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్: యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్' పేరిట కెనడా కేంద్రంగా యూఎన్ అధీనంలో పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య 58,700 ఆనకట్టలు నిర్మితం అయ్యాయని, వీటన్నింటి వయసు 50 నుంచి 100 సంవత్సరాలు మాత్రమేనని గుర్తు చేసింది. 50 ఏళ్లు దాటిన ఏ బహుళార్ద సాధక ప్రాజెక్టు అయినా, దాని వయసు ముగిసినట్టుగానే భావించాలని పేర్కొంటూ, వీటి నిర్వహణ, మరమ్మతులు, వైఫల్యాలు సంభవిస్తే తక్షణ చర్యలకు ఆయా దేశాలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏఏ ప్రాజెక్టుల డిజైన్ లైఫ్ ముగింపు దశకు వచ్చిందో ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నివేదికలో యూఎస్ఏ, ఫ్రాన్స్, కెనడా, ఇండియా, జపాన్, జాంబియా, జింబాబ్వే తదితర దేశాల్లో నదులపై నిర్మితమైన ప్రాజెక్టులను గురించి ప్రస్తావించింది.
                               ఆనకట్టలను ఎంత ఉన్నతంగా, పటిష్ఠంగా నిర్మించినా, వాటికీ జీవితకాలం ఉంటుందని, ఇప్పుడున్న డ్యాముల్లో 55 శాతం... అంటే 32,716 డ్యామ్ లు జీవితకాలాన్ని ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించింది. ఇండియాలో 1,115 ఆనకట్టలు 2025 నాటికి 50సంవత్సరాల వయసుకు చేరుకుంటాయని, 2050 నాటికి 4,250 డ్యామ్ లకు జీవిత కాలం పూర్తవుతుందని తెలియజేసింది. ఈ డ్యాముల కింద దాదాపు 35 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని, ముఖ్యంగా కేరళలోని ముళ్లపెరియార్ ఆనకట్టను నిర్మించి 100 సంవత్సరాలు దాటిందని ప్రస్తావించింది. ఈ డ్యామ్ బద్ధలైతే ఎంతో మంది ప్రాణాలు పోతాయని, దీనిపై కేరళ, తమిళనాడు అప్రమత్తంగా ఉండి, ముందే చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక యూఎస్ లోని 90,580 ఆనకట్టల సరాసరి వయసు ఇప్పటికే 56 సంవత్సరాలు దాటిందని, వీటిని పునర్నిర్మించాలంటే 64 బిలియన్ డాలర్లు అవసరమని తెలిపింది.


చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>