PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/beware-jagan-there-may-be-blast-of-lava-from-higher-communities6caa368a-f730-45b9-9e02-dea8192a895a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/beware-jagan-there-may-be-blast-of-lava-from-higher-communities6caa368a-f730-45b9-9e02-dea8192a895a-415x250-IndiaHerald.jpgఒకే కుటుంబములోని వ్యక్తులు అంటే జగనోరి తల్లి విజయమ్మ గారు, సోదరి షర్మిల, బైబిల్ పట్టుకోని తిరుగుతూ ఉంటారు. ఏకంగా బావ బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రచారం వృత్తిగా ఎన్నుకొని క్రిష్టియానిటీ ప్రచారంలో వివిధ వేదికలపై దుమ్ము లేపుటుంటారు. అంతే కాదు ఈయనకు మత నిర్వాహణ హైరార్కిలో ఉన్నత స్థాయి కల్పించటానికి (బహుశ “ప్రొఫెట్ కావచ్చు) కట్టపెట్టటానికి తీవ్రంగా ప్రచారం, ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. నెల్లురులో హోర్డింగ్స్ లో ఆ ప్రచారం కనిపిస్తుందని తెలిసింది. religion favoritism os jagan;modi;kcr;amala akkineni;kumaar;anil music;bhavana;poorna;sampada;tiru;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;2019;scheduled caste;scheduled tribes;bible;letter;tdp;local language;central government;ycp;anil kumar singhal;nijamఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!ఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!religion favoritism os jagan;modi;kcr;amala akkineni;kumaar;anil music;bhavana;poorna;sampada;tiru;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;2019;scheduled caste;scheduled tribes;bible;letter;tdp;local language;central government;ycp;anil kumar singhal;nijamSun, 24 Jan 2021 10:10:00 GMT
ఒకే కుటుంబములోని వ్యక్తులు అంటే జగనోరి  తల్లి విజయమ్మ గారు, సోదరి షర్మిల, బైబిల్ పట్టుకోని తిరుగుతూ ఉంటారు. ఏకంగా బావ బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రచారం వృత్తిగా ఎన్నుకొని క్రిష్టియానిటీ ప్రచారంలో వివిధ వేదికలపై దుమ్ము లేపుటుంటారు. అంతే కాదు ఈయనకు మత నిర్వాహణ హైరార్కిలో ఉన్నత స్థాయి కల్పించటానికి (బహుశ “ప్రొఫెట్ కావచ్చు) కట్టపెట్టటానికి తీవ్రంగా ప్రచారం, ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. నెల్లురులో హోర్డింగ్స్ లో ఆ ప్రచారం కనిపిస్తుందని తెలిసింది.

అలాంటి కుటుంబంలో జగనోరొక్కరు నాకు మతాభిమానం లేదు అన్ని మతాలను సమాధరిస్తాను అని గప్పాలు కొట్టిస్తే జనాలు నమ్మటానికి చెవిలో కాలిఫ్లవర్లు పెట్టుకోని ఏవరూ కూర్చోలేదు. అంతా ఓట్ల రాజకీయాలేనని అందరికి తెలుసు.

అయినా జగనోరిది ఏ మతం? ఏ మత విధానాలు పాటిస్తారు? అనేది ఎవరికి అవసరం లేదు. పక్షపాతంతో ఇతర మతాల్ని అణగద్రొక్కే ప్రయత్నాలు జరుగుతుండటం మాత్రమే అసలు సమస్య.  జగనోరి మతంపై ఎన్ని న్యాయస్థానాలలో తీర్పులొచ్చినా ప్రజల అంతరంగం అంతతేలికగా నమ్మదు. అందుకే "ప్రయత్నం కాదు ప్రయత్నిస్తున్నట్లు కూడా కనిపించాలి" అనేది నేడు ప్రజలనుంచి వినిపిస్తున్న మాట. ఎంతమంది ప్రజాప్రతినిధులతో జగనోరికి మతంతో పనిలేదని ప్రచారం చేయించినా -ప్రయత్నం యధార్ధం మాత్రమే జనం గ్రహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరులా హిందూ మత సంరక్షణ కోసం, ఉద్యమ నిర్మాణానికి నిశ్శబ్ధంగా ప్రయత్నాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జగనోరిపై తీవ్రవ్యతిరేఖత బళ్ళుమనటం ఖాయం. జస్ట్ టైం ఈజ్ ది మేటర్.

త‌మ‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా  చిన్న‌చూపు చూస్తున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌లోని అగ్ర‌కులాల్లో బ‌ల‌మైన అభిప్రాయం అన్నీ చోట్ల వ్యక్తమౌతుంది. జాతి సంపదంతా సంక్షేమ ప‌థ‌కాల ‌కోసం పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు మాత్ర‌మే అంద‌జేస్తున్నార‌ని, తాము కూడా ఈ సమాజములో భాగమేనని = అంతకుమించి ఓట‌ర్ల‌మే అని, తాము కూడా ఓటెశామని అందుకే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భావన పెల్లుబుకుతుంది.

కానీ సంక్షేమ ప‌థ‌కాల‌ అమ‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి పూర్తి నిరాధ‌ర‌ణ‌కు గుర‌వుతున్నామ‌నే అసంతృప్తి, ఆగ్ర‌హం అగ్ర‌కులాల్లో పొంగిపొర్లే వాస్త‌వాన్ని వైసీపీ ప్ర‌భుత్వం గుర్తించాల్సి ఉంది. అందుకే వారిని సంతృప్తిప‌రిచే చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. అగ్ర‌వ‌ర్ణాల్లో జగనోరు తనపై పెచ్చరిల్లే వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు ఇప్పటికీ మంచి అవ‌కాశం ఉంది. కానీ ఆ దిశ‌గా ఆయ‌న ఆలోచించ‌డం ఏంతో అవసరం.

కుటుంబ, రాజకీయా స్వార్ధం కొసం తన వ్యక్తిత్వాన్నే ఫణంగా పెట్టి  - ముస్లిం మతాభిమానిగా మారిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దుబ్బాక, హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నారు. "ముక్కునేలకు రాయటం, మెడకోసుకోవటం, పాదాలలో గుచ్చుకున్న ముల్లు నోటితో పీకటం" మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అది గ్రహించి డిల్లీలో కలవకుంట్ల వారి రాజకీయ చక్రం తిప్పటం మానేసి - తాజాగా తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు (ఈడ‌బ్ల్యూఎస్‌) ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల కోటాను అమ‌లు చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌య‌మై రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్త‌ర్వులు కూడా జారీ చేసేందుకు ఆ ప్ర‌భుత్వం క‌స‌రత్తు చేస్తోంది.

జ‌గ‌నోరు కూడా ఆ దిశ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర కుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు గలిగిన అగ్రకులాల నిరుపేదలకు ఈ రిజర్వేషన్లను వర్తింప జేసింది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్‌ (ఓపెన్) కేటగిరీ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రంలోని నరెంద్ర మోడీ ప్ర‌భుత్వం ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి ఈ రిజ‌ర్వేష‌న్ అమ‌లు కూడా కీల‌క పాత్ర పోషించింద‌నే అభిప్రాయాలు ఉన్నత రాజకీయ వర్గాల నుండి వినిపిస్తుంది.

“ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ కోటా”ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన తెలంగాణ విష‌యానికి వ‌ద్దాం. తెలంగాణ‌లో ఇప్ప‌టికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. “ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకుంటే రిజ‌ర్వేష‌న్లు 60 శాతం” వరకు పెరుగుతాయి.

టీడీపీ పాల‌న చరమాంకంలో “ఈడ‌బ్ల్యూఎస్ కోటా” లోని ప‌ది శాతంలో, ఐదు శాతం కాపుల‌కు కేటాయించి, తన హామీని నిల‌బెట్టుకున్నాన‌ని ఆ ప్రభుత్వం న‌మ్మించింది. అయితే ఆ పాచిక‌లాట  కాపుల ముందు జావగారి పోయింది. జగనోరి ప్ర‌భుత్వం కనీసం కాపుల‌కు ఇచ్చిన ఐదు శాతం రిజ‌ర్వేష‌న్ కొనసాగించకుండా చెల్ల‌ద‌ని ర‌ద్దచేసి మంచి పని చేసింది.

అయితే కేంద్ర‌ ప్ర‌భుత్వం 103 వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా తీసుకొచ్చిన “ఈడ‌బ్ల్యూఎస్ కోటా రిజ‌ర్వేష‌న్” అమ‌లు సాధికారతను రాష్ట్రాల‌కే ఇచ్చింది. స్థానిక స‌మ‌స్య‌ల దృష్ట్యా “ఈడ‌బ్ల్యూఎస్” కోటాను అమ‌లు చేసేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించటం లేదు అందులో మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే కేంద్రం ఆలొచన ప్రకారం ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాలి. కాపులకు 5 శాతం పంచటానికిది బాబోరి ఇంటి నుంచి తెచ్చి పెట్టే ప్రసాదం కాదు.

అయితే జగన్ ఇప్పుడు తాత్సారం చేయకుండా వెనువెంటనే కేసీఆర్ లాగా శాతం పది రిజర్వేషణ్లు “ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్‌ ఓపెన్ కేటగిరీ పేదలకు, అంటే ఇప్పటికి ఎలాంటి రిజర్వేషణ్ కేటగిరీల్లో లేనివారికి వర్తింపజేయాలి” మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అణ‌గారిన వ‌ర్గాల‌ను ప‌ట్టించుకున్నంత‌గా త‌మ విష‌యంలో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అగ్ర‌వ‌ర్ణాల్లో అందరికి సంపూర్ణ అసంతృప్తి ఉంది. సంక్షేమ పధకాలు అన్నీ వాళ్ల‌కేనా అనే వ్యాఖ్యలు అగ్ర‌వ‌ర్ణాల నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి.

కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "ఈడబ్ల్యూఎస్"‌ పది శాతం రిజర్వేషన్ల కోటాను ఏపీలో అమ‌లు చేసి, గత ఏడుదశాబ్ధాలుగా ఈ కుశ్చిత రాజకీయాల వల్ల ఆర్ధికంగా అట్టడుగున చితికిపోయి పడిపోయిన వ‌ర్గాల్లో గూడుక‌ట్టుకుంటున్న అసంతృప్తి "బళ్ళున విస్పోఠనం" అవ్వక ముందే ఏపిలో కూడా అమలు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి.


“ఈడ‌బ్ల్యూఎస్ కోటా” అమ‌లుతో విద్య‌, ఉద్యోగాల్లో అగ్ర‌వ‌ర్ణాల పేద‌ల‌కు కూడా ఎంతోకొంత  ల‌బ్ధి చేకూరుతుంది. ప్ర‌భుత్వం అంటే అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోతుంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో రావాలి. ఆ దిశ‌గా సానుకూల దృక్ప‌థం క‌లిగించేందుకు “ఈడ‌బ్ల్యూఎస్ కోటా” అమ‌లు ఎంతో దోహ‌దం చేస్తుంది. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఆ కోటాను అమ‌లు చేయ‌నున్న నేప‌థ్యంలో, ఏపీ ప్ర‌భుత్వంపై కూడా త‌ప్ప‌కుండా ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంది. అంతవరకు జగనోరు తాత్సారం చేయకుండా నిర్ణయం తీసుకొని అమలుకు అదేశాలు ఇవ్వటం ఈ పరిస్థితుల్లో ఎంతైనా మంచిది.

పైగా "ఈడ‌బ్ల్యూఎస్ కోటా" అమ‌లుకు జ‌గ‌న్ ‌కు ఇబ్బందులు కూడా లేవు. మ‌రి అగ్ర‌వ‌ర్ణ నిరుపేద‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే 10% రిజ‌ర్వేష‌న్‌ను ఇప్పుడు కాక‌పోతే, ఇంకెప్పుడు అమ‌లుచేస్తారు? అనేది ఆయా వర్గాలుసూటిగా సంధించే  ప్రశ్న. ఎలక్షణ్ మ్యానిపెస్టో లో చెప్పిన‌వే చేస్తాను అంటే ఇప్పటికే చెప్ప‌న‌వి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి ప్రజల ముందు దోషిగా నిలబడతాడు.

“ఈడ‌బ్ల్యూఎస్ కోటా రిజ‌ర్వేష‌న్ల అమ‌లు” లో ఏ మాత్రం సంశయించినా, త‌ట‌ప‌టాయించినా రానున్న ఎన్నికల్లో జగనోరి చేతికి చిప్పేనని చెప్పటానికి ఏవరైనా ఆలోచించనవసరం లేదు. తాను, తనమతం అని అంతరంగంలోనైనా అనుకునే వారు రాజకీయాల్లో బతికి బట్ట కట్టిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు.

ఇప్పుడు జనంలో ఎగసి పడుతున్న అసంతృప్తి అగ్ని శిఖలుగా మారక ముందే హిందూ మత సంపద ఇతర మతాల అభివృద్ధికి కోసం, స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం  తరలించటం  ఎంతో దురదృష్టకరం. జగనోరు శ్రీవేంకటేశ్వరుని దైవంలా భావించి నమ్మినా నమ్మకున్నా ఎవరికీ అవసరం లేదు. అక్కడ దైవాపచారాలు, బ్రాహ్మణ, పురోహితులకు అపచారాలు, చేస్తూ ఇక్కడి సంపద తరలిస్తూ ఇతర మతాల అభివృద్ధికి చేసే పనులు ప్రజలు నిరంతరం గమనిస్తున్నారు. బ్రాహ్మణ వర్గాలకు ప్రత్యేకించి పురోహితులకు అన్యాయం తలపెట్టి చేసిన, చేస్తున్న, హానికి గత ప్రభుత్వాలు కూలిపోయాయి. వ్యక్తులు నామరూపాలు లేకుండా ఏలా అంతరించి పోయారో జగనోరికి తెలియంది కాదు.

ప్రస్తుతం జగనోరు ప్రజా విశ్వాసంలో ఎంతో కొంత కేసీఆర్ కంటే బెటర్. కేసీఆర్ ప్రభుత్వాన్ని కచరా కుటుంబంగా తెలంగాణ జనావళి గుర్తించిన తరవాత ఆయన వాగ్ధానాలను ఎవ్వరూ నమ్మట్లేదు. బహుశ ఆయన వాగ్ధానం చేసిన కార్యక్రమాలు నిజంగా చేసినా కూడా ఆయనను, ఆయన కుటుంబాన్ని, టీఅరెస్ జనాల్ని నూరు శాతం నమ్మను గాక నమ్మరు.

ఆ పరిస్థితికి జగనోరు అతి చేరువలో ఉన్నా - ఇంకా జనం గుర్తించలేదు. అదీ జరగక ముందే జగనోరు జాగృతమైతే మంచిది.  




ఆన్ లైన్ డేటింగ్ యాప్ లపై ఇంటర్‌పోల్ హెచ్చరిక.. ఇకమీదట..

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !

జగన్‌కు బావ బ్రదర్ అనిల్ బిగ్‌ షాక్.. ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్నది ఇదే..!?

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్లో లూప్‌హోల్‌... ఇదే వాళ్ల‌ను కాపాడుతుందా..!

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>